ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? ఫ్యూచర్ మార్కెట్లో ధరల్లో తేడా ఎప్పుడంటే?
బంగారం ధరలు శుక్రవారం క్షీణించాయి. అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.7 శాతం క్షీణించి ఔన్స్ 1,893 డాలర్లు పలికింది. క్రితం సెషన్‌లో పసిడి ఏకంగా 1900 మార్క్ దాటి... 1,911.66 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం క్షీణించి 1,898 డాలర్లు పలికింది. అయితే ఈ వారంలో బులియన్ ఇప్పటి వరకు 1.8 శాతం లాభపడింది. ఆగస్ట్ 7వ తేదీ తర్వాత ఇది అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. ఆగస్ట్ ప్రారంభ వారంలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రికార్డు గరిష్టాన్ని తాకాయి. కామెక్స్‌లో 2,075 డాలర్లు, ఎంసీఎక్స్‌లో రూ.56,200 దాటింది.

ఏడాదిలో 26 శాతం పెరుగుదల
సిక్స్ బాస్కెట్ కరెన్సీతో డాలర్ వ్యాల్యూ 0.2 శాతం పెరిగింది. ఆ కరెన్సీల్లో బంగారం ధర ఖరీదు అవుతుంది. కామెక్స్‌లో ఏడాదిలో పసిడి ధర 26 శాతం పెరిగి 1893 డాలర్లుగా ఉంది. 52 వారాల కనిష్టం 1447 డాలర్లు, గరిష్టం 2,072 డాలర్లు. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి ఔన్స్ 1.4 శాతం తగ్గి 23.56 డాలర్లకు క్షీణించింది. అయితే ఈ వారం వెండి 3 శాతం పెరిగింది. ప్లాటినమ్ 1 శాతం క్షీణించి 887.78 డాలర్లకు, పల్లాడియం 0.2 శాతం తగ్గి 2,309.97 డాలర్లకు చేరుకుంది.

నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640, 22 క్యారెట్ల పసిడి రూ.48,260 పలికింది. కిలో వెండి రూ.61,200 పలికింది. బెంగళూరులో 24 క్యారెట్ల పసిడి రూ.52,890, 22 క్యారెట్లు రూ.47,560 పలికింది. కేరళలో 24 క్యారెట్ల పసిడి రూ.50,870, 22 క్యారెట్లు రూ.46,610 పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.53,420, 22 క్యారెట్లు రూ.48,250 పలికింది.

బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు
వ్యాపార సమయంలో కామెక్స్, ఎంసీఎక్స్‌లలో బంగారం ధరలు ఎప్పటికి అప్పుడు మారుతుంటాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలు సహా వివిధ కారణాలు ప్రభావం చూపుతాయి. దేశాల మధ్య వివాదాలు, ట్రేడ్ వార్, డిమాండ్, సరఫరా వంటి అంశాలు ధరల్లో మార్పులు తీసుకు వస్తాయి. ఇక ఆయా దేశాలు, ప్రాంతాల ఆధారంగా ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఇతర ఛార్జీల వల్ల ధరల్లో తేడాలు ఉంటాయి. ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద పసిడి వినియోగదారు.


Click it and Unblock the Notifications