ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 2020 క్యాలెండర్ ఇయర్‌లో 11 శాతం మేర క్షీణించింది. బంగారం ఎక్కువగా వినియోగించే దేశాల్లో చైనా, భారత్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది ఎగుమతులు, దిగుమతులు క్షీణించాయి. 2020 మొదటి అర్ధ సంవత్సరంలో పసిడి సహా అన్ని సేల్స్ పడిపోయాయి. మన దేశంలోకి బంగారం దిగుమతులు తగ్గడంతో పాటు, జ్యువెల్లరీ ఎగుమతులు కూడా క్షీణించాయి. కరోనా కారణంగా కొనుగోళ్లు కూడా క్షీణించాయి. దీంతో ప్రపంచ డిమాండ్ కనిష్టానికి పడిపోయింది.

14 శాతం డౌన్
కరోనా బులియన్ వాణిజ్యం భౌగోళికతను కూడా మార్చింది. భారత్ నుండి ఆభరణాల ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. యూరోప్, అమెరికా నుండి పెట్టుబడిదారులు ఎక్కువగా ఉంటారు. 2020లో కరోనా, దిగుమతులు క్షీణించి బంగారం ధరలు 25 శాతం పెరిగాయి. కరోనా పరిస్థితుల్లో ధరలు కూడా పెరగడంతో బంగారం, జ్యువెల్లరీ కొనుగోళ్లు తగ్గాయి. గత ఏడాది ప్రపంచ బంగారం డిమాండ్ 3,759.6 టన్నులకు పడిపోయింది. 2019తో పోలిస్తే ఇది 14 శాతం తక్కువ. 2009 నుండి మొదటిసారి 4,000 టన్నుల కంటే దిగువకు వచ్చింది.

త్రైమాసికం పరంగా..
పదకొండేళ్లలో తొలిసారి బంగారం డిమాండ్ భారీగా తగ్గిందని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ తన త్రైమాసిక నివేదికలో తెలిపింది. 2020 కూడా వీక్ డిమాండ్‌తో ముగిసిందన్నారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 783.4 టన్నులకు పడిపోయింది. ఏడాది ప్రాతిపదికన ఇది 28 శాతం తక్కువ. 2008 నుండి ఓ త్రైమాసికంలో ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే మొదటిసారి.

ఇన్వెస్ట్‌మెంట్ అప్
బంగారాన్ని భారతీయులు ఎక్కువగా ధరిస్తారు. అందుకే ఇక్కడ డిమాండ్ ఎక్కువ. అలాగే సురక్షిత పెట్టుబడిగా కూడా భావిస్తారు. గత ఏడాది ఇన్వెస్టర్లు 1773.2 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. 2019తో చూస్తే ఇది 40 శాతం ఎక్కువ. గత కొన్నేళ్లుగా ఏ ఏడాదితో పోల్చినా ఏడాది ప్రాతిపదికన 40 శాతం పెరగడం ఇదే గరిష్టం. ప్రస్తుతం బంగారం ధరలు ఔన్స్ 1850 డాలర్లుగా ఉంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో రూ.49,000 దిగువన ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications