For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయం తగ్గి సాయంత్రానికి అంతేస్థాయిలో పెరిగిన బంగారం ధర

|

బంగారం ధరలు ఉదయం స్వల్పంగా క్షీణించి, సాయంత్రానికి అంతేస్థాయిలో పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ పది గ్రాములు రూ.49,000 పైకి చేరుకుంది. వెండి ధరలు మాత్రం స్వల్పంగానే పెరిగాయి. రూ.72వేల దిగువనే ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం 1900 డాలర్ల సమీపానికి చేరుకోగా, వెండి ఫ్యూచర్స్ 28 డాలర్లు క్రాస్ చేసింది. గతవారం అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 40 డాలర్లు క్షీణించింది. ఈ వారం కూడా కాస్త పెరిగే అవకాశాలే ఉన్నాయి.

ఉదయం తగ్గి, సాయంత్రానికి పెరిగిన బంగారం

ఉదయం తగ్గి, సాయంత్రానికి పెరిగిన బంగారం

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.106.00 (0.22%) పెరిగి రూ.49100.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,947.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,100.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,782.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.79.00 (0.16%) పెరిగి రూ.49372.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,306.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,380.00 గరిష్టాన్ని, రూ.49,071.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.300 పెరిగిన వెండి

రూ.300 పెరిగిన వెండి

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం తగ్గి, సాయంత్రానికి పెరిగింది. సాయంత్రం సెషన్లో రూ.284.00 (0.40%) పెరిగి రూ.71823.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,320.00 వద్ద ప్రారంభమై, రూ.71,860.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.70,836.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.245.00 (0.34%) పెరిగి రూ.72941.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,450.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,943.00 గరిష్టాన్ని, రూ.72,052.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 1895 డాలర్ల పైకి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 5.25 (0.28%) డాలర్లు తగ్గి 1,897.25 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,883.75 - 1,897.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.131 (0.47%) డాలర్లు తగ్గి 28.027 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.600 - 28.058 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

ఉదయం తగ్గి సాయంత్రానికి అంతేస్థాయిలో పెరిగిన బంగారం ధర | Gold declines by Rs 152: silver tumbles by Rs 540 on weak global trends

Gold declined by Rs 152 to Rs 48,107 per 10 gram in the national capital on Monday in line with weak global trends, according to HDFC Securities. In the previous trade, the precious metal had closed at Rs 48,259 per 10 gram.
Story first published: Monday, June 7, 2021, 22:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X