For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వామ్మో... బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయ్: రూ.49,000 దిశగా పరుగు

|

బంగారం ధరలు మరోసారి ఎగిసిపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్ల దిశగా, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో రూ.49,000 దిశగా పరుగులు పెడుతోంది. బాండ్ ఈల్డ్స్ క్షీణించడంతో పాటు ఈక్విటీ మార్కెట్లు పతనం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో 4 నెలల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంవైపు చూస్తున్నారు. ద్రవ్యోల్భణం భారీగా పెరుగుతోందనే వార్తలు, కరోనా కేసుల పెరుగుదల ప్రభావం చూపుతోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు భారీగా ఎగిశాయి.

భారీగా పెరిగిన బంగారం ధర

భారీగా పెరిగిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.462.00 (0.96%) పెరిగి రూ.48769.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,261.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,875.00 గరిష్టాన్ని, రూ.47,950.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.527.00 (1.08%) పెరిగి రూ.49350.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,792.00 వద్ద ప్రారంభమై, రూ.49,443.00 గరిష్టాన్ని, రూ.49,448.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి మాత్రం భారీగా తగ్గింది

వెండి మాత్రం భారీగా తగ్గింది

వెండి ధరలు తగ్గాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.703.00 (0.96%) తగ్గి రూ.72493.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,630.00 వద్ద ప్రారంభమై, రూ.73,245.00 గరిష్టాన్ని, రూ.71,141.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.638.00 (0.86%) తగ్గి రూ.73585.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,830.00 ప్రారంభమైన ధర, రూ.74,370.00 వద్ద గరిష్టాన్ని, రూ.72,322.00 కనిష్టాన్ని తాకింది.

1900 డాలర్ల దిశగా

1900 డాలర్ల దిశగా

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగి, 1900 డాలర్ల దిశగా సాగుతున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 17.70 (0.95%) డాలర్లు పెరిగి 1,885.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,852.50 - 1,891.25 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం తగ్గింది. -0.235 (0.83%) డాలర్లు తగ్గి 28.098 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.455 - 28.363

డాలర్ల మధ్య కదలాడింది.

English summary

వామ్మో... బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయ్: రూ.49,000 దిశగా పరుగు | Gold Climbs to Four Month High as Markets Tumble

Gold advanced to the highest since January as bond yields slipped and equity markets tumbled, boosting demand for the metal as a haven.
Story first published: Wednesday, May 19, 2021, 22:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X