ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. దీనికి తోడు సుంకాల ఆందోళనలు మరింతగా భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే Gold ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో Gold ధరలు ఏకంగా లక్ష మార్కును తాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బంగారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా బంగారంపై షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
బంగారం ధరలు వచ్చే ఏడాదిలో ఔన్సుకు 4,000 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని కామా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కాలిన్ షా తెలిపారు.మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 3 లక్షల 40 వేలుపై మాటే..ఆరు నుంచి తొమ్మిది నెలల లోపు ఈ ధరలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. CNBC-TV18తో షా మాట్లాడుతూ.. బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు లేవన్నారు. ధరలు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందన్నారు. యుఎస్ వాణిజ్య ఒప్పందాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం మీదకు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారని తెలిపారు.

బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ ప్లాటినం, వజ్రాలపై కూడా పెట్టుబడిదారులకు విశేషమైన ఆశలు ఉన్నాయని కామా జువెలరీ చైర్మన్ కాలిన్ షా తెలిపారు. 2024తో పోలిస్తే ..2025లో లగ్జరీ ఉత్పత్తులు, వజ్రాల మార్కెట్ మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీపావళి సమయానికి ఈ ధరల పెరుగుదల చోటు చేసుకోవచ్చని షా అభిప్రాయపడ్డారు.దేశీయ ఆభరణాల మార్కెట్లో ప్లాటినం డిమాండ్ వేగంగా పెరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా మగవారిలో ఈ ధోరణి బలపడుతోందని వారి ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ట్రెండ్ కారణంగా పోటీ తత్వం నెలకొందన్నారు.
భారత మార్కెట్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) 9 క్యారెట్ల హాల్‌మార్కింగ్‌ను అనుమతించిన సంగతి విదితమే. తక్కువ ధరలో ఆభరణాలను కొనుగోలు చేయదలచిన వినియోగదారుల కోసం ఈ నిర్ణక్ష్ం ఒక కొత్త ప్రవేశ కేంద్రం అవుతుందని షా చెప్పారు. దేశం సాధారణంగా 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే ఇష్టంగా కొనుగోలు చేసేది. ఇటీవల కాలంలో 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారం కూడా ప్రజాదరణ పొందింది. బంగారం ధరలు 35 శాతం పెరగడంతో 9 క్యారట్ల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపత్యంలోనే దీపావళికి 9 క్యారెట్ల ఆభరణాలు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తాయన్నారు షా.
ఇక తక్కువ క్యారెట్ల బంగారంపై తయారీ ఛార్జీలు (making charges) ఎక్కువగా ఉంటాయన్న ఆందోళనలపై షా సమాధానమిచ్చారు. శాతంగా లేదా గ్రాముకు తయారీ ఛార్జీలు ఎక్కువైనా, మొత్తం ఆభరణం ధర 14 లేదా 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే తక్కువగా ఉంటుందని తెలిపారు.బంగారం ధరలు పెరగడం వల్ల సంవత్సరానికి మొత్తం వాల్యూమ్ (విక్రయ పరిమాణం) తగ్గవచ్చని అయితే.. విలువ ఆధారంగా వృద్ధి (value growth) 5 నుండి 10 శాతం పెరుగుతుందని షా అంచనా వేశారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications