భారీగా పెరిగిన బంగారం ధరలు, రూ.51,000 మార్క్ క్రాస్, అక్కడ మాత్రం డౌన్
బంగారం ధరలు మంగళవారం(అక్టోబర్ 6) భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో సాయంకాలం ట్రేడింగ్ సమయానికి 10 గ్రాముల పసిడి డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.270 పెరిగి రూ.50,895 పలికింది. బిజినెస్ టర్నోవర్ 15,497 లాట్లుగా ఉంది. ఫిబ్రవరి ఫ్యూచర్ రూ.290కి పైగా పెరిగి రూ.51,023 పలికింది. బిజినెస్ టర్నోవర్ 680 లాట్లుగా ఉంది. డిసెంబర్, ఫిబ్రవరి కాంట్రాక్ట్ ట్రేడ్ వ్యాల్యూ వరుసగా రూ.2,993.64 కోట్లు, రూ.46.21 కోట్లుగా ఉంది. గోల్డ్ మినీ కాంట్రాక్ట్ (నవంబర్) రూ.250 వరకు పెరిగి 10 గ్రాములు రూ.50,945 పలికింది. బిజినెస్ టర్నోవర్ 10,656 లాట్లుగా ఉంది. ముంబై మార్కెట్లో పసిడి రూ.550కి పైగా పెరిగి రూ.51,044ని తాకింది.

దేశ రాజధానిలో పసిడి ధరలు..
భారత ఆర్థిక రాజధాని ముంబైలో 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి ధరలు వరుసగా రూ.38,283, రూ.46,756, రూ.51,044 పలికింది. వీటికి 3 శాతం జీఎస్టీ అదనం. నిన్న కిలో వెండి రూ.వెయ్యి పెరిగింది. ఈరోజు కూడా స్వల్పంగా పెరిగిన వెండి కిలో రూ.62 వేల మార్క్ దాటింది.
రూపాయి క్షీణించడంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.400కు పైగా పెరిగి రూ.51,790 చేరుకుంది. వెండి ధర కిలో రూ.750 పెరిగి రూ.63వేలను దాటింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 4.78 డాలర్లు పెరిగి ఔన్స్ 1,918.20 పలికింది. అయితే గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం క్షీణించి 1,910 డాలర్లకు తగ్గింది. కరోనా వైరస్ తీవ్రత, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. దీంతో ధరలు మరికొన్ని రోజులు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ ట్రేడెడ్ ఎస్పీడీఆర్ వద్ద బంగారం నిల్వలు 1275.60 టన్నులతో దాదాపు యథాతథంగా ఉంది.

గరిష్టం.. కనిష్టం
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర నిన్న గరిష్టం 1918.82 డాలర్లను తాకింది. నిన్న కనిష్ట ధర ఔన్స్ 1887.06 డాలర్లను తాకింది. గతవారం గరిష్టం 1917.16 డాలర్లు, గత వారం కనిష్టం 1848.82 డాలర్లు, గత నెల గరిష్టం 1992.42 డాలర్లు, గత నెల కనిష్టం 1848.82 పలికింది.


Click it and Unblock the Notifications