శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్ మరి: పసిడి రేట్లు ఇలా

హైదరాబాద్: దేశవ్యాప్తంగా బంగారం, వెండి రేట్లల్లో అప్ అండ్ డౌన్స్ కొనసాగుతున్నాయి. శనివారం వాటి ధరల్లో క్యారెట్ల వారీగా పెరుగుదల, తగ్గుదల నెలకొంది. బంగారం, వెండి ధరల్లో కొద్దిరోజులుగా నెలకొన్న హెచ్చుతగ్గులు యధాతథంగా ఉంటోన్నాయి. సాధారణంగా వీకెండ్‌లోనూ వాటి ధరల్లో కొద్దో, గొప్పో కదలికలు కనిపిస్తుంటాయి. ఈ వారాంతం కూడా అదే సంప్రదాయం కొనసాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు నిలకడగా లేవు.

స్వల్పంగా పెరుగుదల..

స్వల్పంగా పెరుగుదల..

మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో శుక్రవారం నాటి బంగారం ధరల ట్రేడింగ్ పెరుగుదలతో ముగిశాయి. ఫ్యూచర్ ట్రేడింగ్‌లో అతి స్వల్పంగా పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, విశాఖపట్నం, విజయవాడల్లో స్వల్పంగా వాటి ధరలు పెరిగాయి.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 44,250 రూపాయలుగా నమోదైంది. శుక్రవారం నాటి ముగింపు రేట్లతో పోల్చుకుంటే 150 రూపాయల పెరుగుదల నమోదైంది. బెంగళూరులోనే 24 క్యారెట్ల బంగారం ధరలోనూ 180 రూపాయల పెరుగుదల రికార్డయింది. 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు 48,280 రూపాయలు.

హైదరాబాద్, బెంగళూర్‌లల్లో

హైదరాబాద్, బెంగళూర్‌లల్లో

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 44,250 రూపాయలుగా నమోదైంది. శుక్రవారం నాటి ముగింపు రేట్లతో పోల్చుకుంటే 150 రూపాయల పెరుగుదల నమోదైంది. బెంగళూరులోనే 24 క్యారెట్ల బంగారం ధరలోనూ 180 రూపాయల పెరుగుదల రికార్డయింది. 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు 48,280 రూపాయలు. విశాఖపట్నం, విజయవాడల్లోనూ ఇవే రేట్లు కనిపించాయి. తిరువనంతపురం బులియన్ మార్కెట్‌లో అవే రేట్లు కొనసాగాయి.

అమెరికన్ మార్కెట్‌లో

అమెరికన్ మార్కెట్‌లో

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో పెరుగుదల నెలకొంది. అమెరికాలో పసిడి లావాదేవీల్లో 2.58 డాలర్ల పెరుగుదల నమోదైంది. ఒక ఔన్స్ బంగారం ధర అమెరికాలో 1,781.77 డాలర్లు పలుకుతోంది. వెండిలో 0.20 డాలర్ పెరుగుదలతో ఔన్స్ ధర 23.02 వద్ద నిలిచింది. వివిధ నగరాల్లో ఈ ఉదయం నమోదైన పసిడి రేట్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 46,740 రూపాయలు, 24 క్యారెట్లు 48,790 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 61,700 రూపాయలు.

వేర్వేరు నగరాల్లో..

వేర్వేరు నగరాల్లో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్ల బంగారం 46,440 రూపాయలు, 24 క్యారెట్లు 48,630 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 61,700 రూపాయలు. చండీగఢ్‌లో 22 క్యారెట్ల బంగారం 46,340 రూపాయలు, 24 క్యారెట్లు 48,980 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 61,700 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 44,650 రూపాయలు, 24 క్యారెట్లు 48,710 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 66,600 రూపాయలు.

ఢిల్లీలో అత్యధికం..

ఢిల్లీలో అత్యధికం..

కోయంబత్తూర్‌లో 22 క్యారెట్ల బంగారం 44,650 రూపాయలు, 24 క్యారెట్లు 48,710 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 66,600 రూపాయలు. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 46,390 రూపాయలు, 24 క్యారెట్లు 50,610 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 61,700 రూపాయలు. జైపూర్‌లో 22 క్యారెట్ల బంగారం 46,440 రూపాయలు, 24 క్యారెట్లు 48,790 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 61,700 రూపాయలు. కొచ్చిలో 22 క్యారెట్ల బంగారం 44,150 రూపాయలు, 24 క్యారెట్లు 48,710 రూపాయలు కాగా.. వెండి కేజీ ఒక్కింటికి 66,600 రూపాయలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+