బంగారం ధరల్లో నేడు పెద్దగా మార్పులేదు. ముంబై బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,875 పలికింది. ఈ అతి ఖరీదైన లోహం అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గత వారం 4 శాతానికి పైగా పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో గత 10 వారాల్లో బంగారం ధరలు మొదటిసారి ఈ స్థాయిలో పడిపోయాయి. ముంబైలో 10 గ్రాముల 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి ధరలు వరుసగా రూ.39,526, రూ.48,274, రూ.52,701గా ఉన్నాయి. జీఎస్టీ అదనం.

తగ్గుతున్న గోల్డ్ ట్రస్ట్ ఫండ్స్
జపాన్ ఆర్థికవ్యవస్థ వరుసగా మూడో క్వార్టర్‌లో క్షీణించింది. అమెరికా రిటైల్ జూలై మాసంలో అంచనాల కంటే పడిపోయాయి. రాబోయే నెలల్లో మరింతగా మందగిస్తుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారు పెట్టుబడులు ఆగస్ట్ 14వ తేదీ నాటికి 0.3 శాతం తగ్గి 1,248.29 టన్నులుగా ఉంది.

బంగారం పెరుగుదల పరిమితం
అమెరికా రిైల్ సేల్స్ డేటా క్షీణించడం, వివిధ ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు పడిపోవడం బంగారం ధరలపై ఒత్తిడి పెంచి, ధరలు పెరగడానికి కారణం కావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ప్యాకేజీపై పెరుగుతున్న అనిశ్చితి, పెరుగుతున్న కరోనా కేసుల వల్ల నేడు బంగారం ధరలపై ఒత్తిడి పెంచినప్పటికీ, స్థిరమైన డాలర్ వంటి ప్రభావంతో బంగారం పెరుగుదలను పరిమితం చేసింది.

ఎంసీఎక్స్‌లో..
నేడు వెండి కిలో రూ.266 పెరిగి రూ.68,034 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో ఓ సమయంలో బంగారం రూ.52.707 నేడు గరిష్టానికి చేరుకుంది. అలాగే రూ.52,113 కనిష్టాన్ని తాకింది. గోల్డ్ ఫ్యూచర్స్ అక్టోబర్ డెలివరీ రూ.315 పెరిగి (0.6 శాతం) రూ.52,542 పలికింది. బిజినెస్ ర్నోవర్ 15,567 లాట్స్‌గా ఉంది. డిసెంబర్ డెలివరీ రూ.421 పెరిగి (0.8 శాతం) రూ.52,750 పలికింది. బిజినెస్ టర్నోవర్ 2,176 టన్నులుగా ఉంది.

హైదరాబాద్ సహా బంగారం ధరలు
బంగారం ధరలు నేడు అతి స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి రూ.55,700కి కాస్త అటుఇటుగా ఉంది. అంతకుముందు రికార్డ్ రూ.58,700 నుండి దాదాపు 3,000 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 2000 డాలర్లకు దిగువనే కొనసాగుతోంది. పసిడి 1953 డాలర్ల వద్ద, వెండిి 26 డాలర్ల వద్ద ఉంది.
More From GoodReturns

Akshaya Tritiya: కేవలం గోల్డ్ మాత్రమే కాదు.. ఈ వస్తువులు కొన్నా ఇంట్లోకి లక్ష్మీ వస్తుంది!

బంగారం ధర ఈ రేటుకు రాగానే కొనడం వెంటనే ఆపేయండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ వ్యూహా కర్తలు..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: అమెరికా ఇరాన్ చర్చల తర్వాత పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కేడియా అడ్వైజరీ షాకింగ్ అంచనా.. పసిడి, సిల్వర్ కొనడం బంద్ చేయాల్సిందేనా..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు భారీ ర్యాలీతో ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 15, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? బిస్కెట్లు, కాయిన్స్ ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

బంగారాన్ని భారీగా కొంటున్న బ్యాంకులు.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ అమ్మేసి మరీ.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications