ఇటీవల కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో జాతీయంగా, అంతర్జాతీయంగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు క్షీణించాయి. ఈ వారంలో గత నాలుగు రోజుల్లో బంగారం ధరలు మూడు రోజులు క్షీణించాయి. నేడు (మే 21, శుక్రవారం) పసిడితో పాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. పసిడి ధరలు పది గ్రాములు రూ.48,400 దిగువకు వచ్చాయి. వెండి రూ.71,200 దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు క్షీణించాయి. 1900 డాలర్ల దిశగా కనిపించిన పసిడి ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి రూ.7800 తక్కువగా ఉంది.

ఫ్యూచర్‌లో తగ్గిన ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.148.00 (0.30%) తగ్గి రూ.48396.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,336.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,670.00 గరిష్టాన్ని, రూ.48,230.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.209.00 (0.43%) తగ్గి రూ.48851.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,850.00 వద్ద ప్రారంభమై, రూ.49,144.00 గరిష్టాన్ని, రూ.48,719.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.1000కి పైగా డౌన్
వెండి ధరలు భారీగా తగ్గాయి. ఏకంగా రూ.1000కి పైగా తగ్గాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.-1,168.00 (-1.62%) తగ్గి రూ.71136.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,750.00 వద్ద ప్రారంభమై, రూ.72,490.00 గరిష్టాన్ని, రూ.70,724.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,194.00 (-1.63%) తగ్గి రూ.72170.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,773.00 ప్రారంభమైన ధర, రూ.73,531.00 వద్ద గరిష్టాన్ని, రూ.71,877.00 కనిష్టాన్ని తాకింది.

గోల్డ్ ఫ్యూచర్స్....
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 1900 డాలర్ల దిశగా పసిడి ఇప్పుడు 1875 డాలర్ల స్థాయికి వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 5.45 (-0.29%) డాలర్లు తగ్గి 1,876.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,870.55 - 1,890.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. 0.555 (-1.98%) డాలర్లు తగ్గి 27.512 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.418 - 28.192 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications