నేడు (మే 3, మంగళవారం) అక్షయ తృతీయ సందర్భంగా పసిడి కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టంతో బంగారం ధరలు రూ.5500కు పైగా తక్కువగా ఉన్నాయి. ఇటీవల రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నాటి పరిస్థితులతో పోల్చినా రూ.4500 తక్కువగా ఉంది. క్రితం సెషన్లోనే బంగారం రూ.1100కు పైగా తగ్గింది.
పది సెషన్ల క్రితం రూ.53,000కు పైన, గతవారం రూ.52,000కు పైన ఉన్న పసిడి ఇప్పుడు రూ.50,600 స్థాయికి దిగి వచ్చింది. అక్షయ తృతీయకు ముందు పసిడి ధరలు భారీగా తగ్గి, ఈ రోజు కొనుగోలు చేయాలనుకునే వారికి సంతోషాన్ని కలిగించింది. అక్షయ తృతీయ పర్వదినం రోజున పసిడి కొనుగోలుకు చాలామంది మొగ్గు చూపుతారు.

మున్ముందు అధిక కొనుగోళ్లు
ఇదిలా ఉండగా, పసిడి అమ్మకాలు కరోనా ముందు కంటే అధికంగా సాగుతాయనే ఆశాభావంతో విక్రయదారులు ఉన్నారు. కరోనా పరిమాణాలతో గత రెండేళ్లుగా అక్షయ తృతీయ అమ్మకాలు అంతంతమాత్రంగా సాగాయి. ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడం, ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడిలోకి పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు పలు ఆఫర్లను ఇస్తున్నాయి జ్యువెల్లరీ సంస్థలు.

బంగారంపై మంచిది
ఆర్థిక, సామాజిక అనిశ్చిత పరిస్థితుల్లో ద్రవ్యోల్భణం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో షేర్లు, ఇతర పెట్టుబడుల కంటే పసిడి పైన పెట్టుబడి సానుకూలంగా ఉంటుంది. జనవరి-మార్చి త్రైమాసికంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. దీంతో బంగారం ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కట్, ఇతర బంగారు ఉత్పత్తుల కొనుగోళ్లు తగ్గాయి. ఇటీవల రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ధరలు పెరిగాయి. మళ్లీ తగ్గుతుందనే అంచనాలతో ఉన్నారు వినియోగదారులు, పెట్టుబడిదారులు. అందుకే కొనుగోళ్లు తగ్గాయి. అందుకు అనుగుణంగా ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయి.

ఇక్రా రేటింగ్స్
బంగారు ఆభరణాల వినియోగం 11 శాతం పెరిగే అవకాశముందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది పటిష్టమైన రిటైల్ పనితీరు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాల డిమాండ్ క్రమంగా 11 శాతానికి పెరిగే అవకాశముందని అంటున్నారు. ఆభరణాల రిటైల్ పరిశ్రమలో, వ్యవస్థీకృత రిటైలర్ల ఆదాయాలు 14 శాతం అధిక వేగంతో పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఐరోపా దేశాల్లో మాత్రం బంగారం వినియోగం వచ్చే ఏడాది తగ్గనుందని నివేదికలు చెబుతున్నాయి.
మన దేశంలో కరోనా ముందు 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో బంగారం అమ్మకాల వృద్ధిరేటు 40 శాతం అధికంగా ఉండవచ్చునని ఇక్రా రేటింగ్స్ వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications