రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ ప్రయాణికులకు 'ఫ్రీడమ్ సేల్' ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం... జనవరి 22 నుంచి జనవరి 29,2021 తేదీల్లో గోఎయిర్ విమాన టికెట్లు బుక్ చేసుకునేవారికి కేవలం రూ.859ని (all-inclusive) ప్రారంభ ధరగా నిర్ణయించింది. అలాగే 'జీరో చేంజ్ ఫీ'ని కూడా వర్తింపజేయనుంది. తద్వారా ప్రయాణికులు అదనపు చార్జీలేవీ చెల్లించకుండానే ట్రావెల్ రీ-ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం కేవలం దేశీ విమాన ప్రయాణికులకు మాత్రమే. అది కూడా వన్ వేకి మాత్రమే వర్తిస్తుంది.
'ఫ్రీడమ్ సేల్' ఆఫర్‌లో గోఎయిర్ విమాన టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు 1 ఏప్రిల్ నుంచి 31 డిసెంబర్ 2021 వరకూ ఎప్పుడైనా విమాన ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ఆఫర్ కింద గోఎయిర్ 1మిలియన్ సీట్లను అందుబాటులోకి తీసుకొస్తుండటం విశేషం. ప్రయాణికులు తమ టికెట్లను గోఎయిర్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఏవిధంగా బుక్ చేసుకున్నా ఈ ఆఫర్ వారికి వర్తిస్తుంది.

తాజా ఆఫర్‌పై గోఎయిర్ సీఈవో కౌశిక్ ఖోనా మాట్లాడుతూ... 'ప్రయాణికులకు గుర్తుండిపోయే అనుభవాలను అందించేందుకు గోఎయిర్ ప్రతీ అవకాశాన్ని అన్వేషిస్తుంది. ఈ ఆఫర్ ప్రయాణికులకు ఒకరకంగా మా తరుపున ధన్యవాదాలు చెప్పడం లాంటిది. దీని ద్వారా ప్రయాణికులకు టికెట్ డబ్బులు గణనీయంగా ఆదా అవుతాయి. ఈ ఆఫర్ భారత్‌లోని మా ప్రయాణికుల్లో ప్రాచుర్యం పొందుతుందన్న నమ్మకంతో ఉన్నాం.' అని పేర్కొన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications