గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ బ్లాక్‌స్టోన్ భారత్ లోని మూడో అతిపెద్ద జెనరిక్స్ కంపెనీ అయిన సిప్లాలో మొత్తం 33.47% ప్రమోటర్ వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో సిప్లా శుక్రవారం నాడు ల్‌టైమ్ హై రూ. 1,238.55కి చేరుకుంది. ఇంట్రాడేలో సిప్లా షేర్లు 6.31 శాతం వరకు పెరిగాయి. హమీద్ కుటుంబం 1935 సిప్లా కంపెనీని ప్రారంభించారు. ఇప్పుడు వీరికున్న వాటాను మొత్తం విక్రయిస్తే.. కంపెనీ హమీద్ కుటుంబం పూర్తి నిష్ర్కమించినట్లు అవుతోంది.
ఒక వేల బ్లాక్ స్టోన్ సిప్లాలో ప్రమోటర్ వాటా సొంత చేసుకుంటే.. ఇది ప్రైవేట్ ఈక్విటీలో అతిపెద్ద ఒప్పందం కానుంది. ఈ డీల్ ఓకే అయితే, బ్లాక్‌స్టోన్ కంపెనీలో అదనంగా 26 శాతం వాటా కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో సిప్లాను 59.4 శాతం వాటాతో బ్లాక్‌స్టోన్ స్వంతం చేసుకోవచ్చు.

"సిప్లా వృత్తిపరంగా నడిచే సంస్థ. ప్రమోటర్ మార్పు వ్యాపార కార్యకలాపాలపై స్వల్ప ప్రభావాన్ని చూపుతుంది. ఏదేమైనప్పటికీ ఈ డీల్ ఓకే అయితే కొత్త ప్రమోటర్‌గ ప్రభావం కూడా కంపెనీపై పడుతోంది. సిప్లా భవిష్యత్తు గమనం చాలావరకు కొత్త ప్రమోటర్ పై ఆధారపడి ఉంటుంది" అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లోని రీసెర్చ్ అనలిస్ట్ తుషార్ మనుధనే చెప్పారు.
1935లో ఖ్వాజా అబ్దుల్ హమీద్ స్థాపించిన సిప్లా భారతదేశ సామాజిక-రాజకీయ మరియు ఆర్థిక చరిత్రలో లోతుగా పాతుకుపోయిందని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్‌లతో సహా భారతీయ ప్రముఖులచే హమీద్ గణనీయంగా ప్రభావితమయ్యారు. ముఖ్యంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏర్పాటుకు దోహదపడ్డారు.
ఔషధ పరిశ్రమలో సిప్లా అసమానమైన స్థానం, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా తక్కువ-ధర జనరిక్ ఔషధాలను ఉత్పత్తి చేయడంలో ఈ కంపెనీ పాత్ర కీలకం. అమెరికన్, జర్మన్, బ్రిటీష్ గుత్తాధిపత్యాన్ని, పేటెంట్ హోల్డర్‌లను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తూ సిప్లాను సరసమైన ఔషధాల ప్రపంచ సరఫరాదారుగా మార్చినందుకు హమీద్ కుమారుడు యూసుఫ్ హమీద్ కృషి చేశారు.


Click it and Unblock the Notifications