ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి సంక్షోభం దిశగా పయనిస్తోందా అనే ప్రశ్న మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, అస్థిర చమురు ధరలు, సాంకేతిక రంగంలో భారీగా ఉద్యోగాల తొలగింపులు, ప్రపంచ మార్కెట్లలోని అనిశ్చితి వాతావరణం.. ఇవన్నీ 2026లో మాంద్య సంకేతాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే ఈ ఆందోళనలు ఆర్థికవేత్తలకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వాంగా చేసిన ఒక ప్రవచనం కూడా ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమైంది.
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. బాబా వాంగా 2026లో ప్రపంచ వ్యాప్తంగా క్యాష్ క్రష్ లేదా నగదు కొరత చోటుచేసుకుంటుందని ముందుగానే చెప్పారని కథనం వెలువరించింది. ఈ కథనం ప్రకారం.. ఆర్థిక వ్యవస్థలు ఒక దశలో వర్చువల్ కరెన్సీలు (డిజిటల్ మనీ), సంప్రదాయ నగదు (హార్డ్ క్యాష్) రెండూ విఫలమయ్యే స్థితికి చేరవచ్చని బాబా వంగా తెలిపినట్లగా పేర్కొంది.దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థల్లో అంతరాయాలు, కరెన్సీ విలువలు క్షీణించడం, మార్కెట్‌లో ద్రవ్యత తగ్గిపోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చని ఆమె అంచనా వేసినట్లు లాడ్‌బైబుల్ నివేదిక తెలిపింది.

ఈ Cash Crush భావన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ప్రజలు 2026లో నిజంగానే ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా?.. డబ్బు విలువ పూర్తిగా తగ్గిపోతుందా? అనే ప్రశ్నలు వేస్తున్నారు. బాబా వాంగా చేసిన ఈ అంచనాలు 2008 లాంటి లేదా అంతకంటే తీవ్రమైన మాంద్యం వచ్చే అవకాశాన్ని సూచిస్తున్నాయని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం ఇది ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు.. బాబా వాంగా ప్రవచనాల ప్రకారం 2026లో ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం కూడా ఉందని చెబుతారు. ఆమె మూడవ ప్రపంచ యుద్ధం ప్రధాన ప్రపంచ శక్తుల మధ్య.. ముఖ్యంగా రష్యా, అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రారంభమవవచ్చని పేర్కొన్నారని మనీకంట్రోల్ నివేదిక తెలిపింది. చైనా తైవాన్‌పై ఆధిపత్యం సాధించే ప్రయత్నాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడం, పశ్చిమ దేశాల మధ్య ఉన్న ఆర్థిక-సైనిక ఉద్రిక్తతలు ఈ ప్రవచనానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఇక బాబా వాంగా మరో ముఖ్యమైన ప్రవచనం కృత్రిమ మేధస్సు (AI) గురించి కూడా ఉంది. ఆమె ప్రకారం 2026 నాటికి AI మానవ వ్యవస్థలపై గణనీయమైన నియంత్రణను సాధిస్తుందని, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఇది ఒకవైపు మానవ జీవితాన్ని సులభతరం చేయగలిగినా, మరోవైపు ఆర్థిక అసమానతలను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆమె చేసిన మరో ఆసక్తికర జోస్యం గ్రహాంతర జీవుల గురించి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. బాబా వాంగా నవంబర్ 2026లో ఒక భారీ అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నట్లు చెబుతున్నారు. నవంబర్ 2026 లో గ్రహాంతర జీవులతో సంపర్కం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంచనాలు హార్వర్డ్ శాస్త్రవేత్త అవి లోబ్ చేసిన పరిశోధనలతో కొంత సమాంతరంగా ఉన్నాయని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇప్పటివరకు బాబా వాంగా చేసిన అనేక ప్రవచనాలు నిజమయ్యాయి. సెప్టెంబర్ 11 దాడులు, బ్రెగ్జిట్, 2004 సునామీ వంటి ఘటనల గురించి చేసిన అంచనాలు కొంతవరకు నిజమయ్యాయని ఆమె అనుచరులు చెబుతున్నారు. అయితే నిపుణులు ఈ ప్రవచనాలను శాస్త్రీయ ఆధారాలతో కాకుండా, ప్రతీకాత్మకంగా చూడాలని సూచిస్తున్నారు. ఏదేమైనా క్యాష్ క్రష్ అనే బాబా వాంగా 2026 ప్రవచనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న అస్థిరతను ప్రతిబింబిస్తోంది. ఇది నిజమవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications