కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి, వ్యవస్థలు దెబ్బతిన్నాయి. గత కొద్ది నెలలుగా క్రమంగా కోలుకుంటున్నాయి. అయితే కరోనా రెండో వేవ్ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా వెలుగు చూసినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొనుగోళ్లను తగ్గించారు. అత్యవసరమైతే తప్ప కొనుగోలు చేయడం లేదు. ఖరీదైన వస్తువుల కొనుగోళ్లు క్షీణించాయి. అంతర్జాతీయంగా విలాసవంతమైన వస్తువులు, ఆభరణాలు, సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు 23 శాతం మేర క్షీణించవచ్చునని ప్రముఖ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ బెయిన్ నివేదిక తెలిపింది.

ఆరేళ్లుగా వచ్చిన వృద్ధి తుడిచి పెట్టుకుపోయింది
కరోనా కారణంగా దాదాపు ఆరేళ్లుగా వచ్చిన వృద్ధి తుడిచి పెట్టుకుపోయిందని బెయిన్ నివేదిక తెలిపింది. కరోనా వల్ల అమ్మకాలు 35 శాతం క్షీణిస్తాయని గతంలో అంచనా వేసింది. గత అంచనాతో పోలిస్తే ఇప్పుడు కాస్త మెరుగైనట్లు భావిస్తున్నారు. మొత్తం అమ్మకాల్లో మూడో వంతు వాటా ఉన్న చైనా మార్కెట్ రికవరీ కావడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. కరోనా వల్ల 2020లో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు తుడిచి పెట్టుకుపోయాయి. పూర్తి సంవత్సరానికి ప్రతికూలత నమోదు చేయనున్నాయి. ప్రారంభ త్రైమాసికాల్లో దెబ్బతిన్న చైనా మాత్రమే మిగతా దేశాల కంటే కోలుకొని, పాజిటివ్ వృద్ధి నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

2009 తర్వాత భారీ క్షీణత
చైనా మార్కెట్ రికవరీకి తోడు భారత్ సహా ఇతర ప్రపంచ మార్కెట్లు కాస్త కోలుకుంటున్నాయి. దీంతో గతంలో 35 శాతం క్షీణిస్తాయని అంచనా వేయగా, తాజా నివేదికలో దానిని 23 శాతానికి సవరించింది. 2020లో విలాస వస్తువుల అమ్మకాలు 217 బిలియన్ యూరోలుగా అంచనా వేశారు. మన కరెన్సీలో 19 లక్షల కోట్లకు పైగా. 2014తో పోలిస్తే ఇది 2 యూరోలు తక్కువ. 2019 నుండి 64 బిలియన్ యూరోలు క్షీణించాయి. 2009లో ఆర్థిక సంక్షోభం సమయంలో 9 శాతం క్షీణత నమోదు చేయగా, ఇప్పుడు అంతకంటే ఎక్కువ తగ్గుతోంది.

ఎప్పుడు కోలుకోవచ్చు
కరోనా కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, లగ్జరీ వస్తువుల రంగం అన్నింటి కంటే ఎక్కువగా దెబ్బతిన్నదని బెయిన్ తెలిపింది. ఇది ఎప్పుడు కోలుకుంటుందనేది కరోనా వ్యాక్సీన్ రాకపైన ఆధారపడి ఉంటుందని పేర్కొంది. వచ్చే ఏడాది ఈ వస్తువుల క్షీణత 10 శాతం నుండి 19 శాతంగా ఉండవచ్చునని తెలిపింది. ఏడాది మొత్తానికి బ్రాండ్ ప్రాఫిట్ 60 శాతం క్షీణించవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా 2022 నుండి 2023 మధ్య కోలుకోవచ్చునని తెలిపింది. 2025 నాటికి ప్రపంచ కస్టమర్ సేల్‌లో చైనా వాటా దాదాపు సగం ఉంటుందని పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications