Tesla Layoffs: ప్రస్తుతం టెస్లా కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఇతర ఆటగాళ్ల నుంచి భారీ పోటీ కొనసాగుతోంది. ప్రఖ్యాత ఆటో తయారీ సంస్థలు టెస్లాకు పోటీగా మోడళ్లను అందుబాటు ధరల్లోనే తీసుకురావటం మస్క్ మామకు చెమటలు పట్టిస్తోంది.
ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా తమ ఉద్యోగుల సంఖ్యను 10 శాతం మేర తగ్గించాలని టెస్లా నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పెరుగుతున్న పోటీతో అమ్మకాలు తగ్గటమే ప్రస్తుత పరిస్థితులకు కారణంగా నిలిచింది. ప్రస్తుత తరుణంలో స్థిరమైన వృద్ధికి పునర్వ్యవస్థీకరణ ముఖ్యమైనదిగా ఎలాన్ మస్క్ భావించటంతో కోతలు ప్రారంభమయ్యాయి. దీనిపై స్పందించిన సీఈవో మస్క్ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి తాము తదుపరి దశ వృద్ధి కోసం కంపెనీని పునర్వ్యవస్థీకరణతో క్రమబద్ధీకరించాలన్నారు.

కంపెనీ నుంచి బ్యాటరీ డెవలప్‌మెంట్ చీఫ్ డ్రూ బాగ్లినో, పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ రోహన్ పటేల్‌తో సహా కంపెనీలోని కీలక వ్యక్తుల నిష్క్రమణ పెట్టుబడిదారులు, విశ్లేషకుల నుండి దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో టెస్లా అగ్రగామిగా ప్రశంశించబడిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగించటంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. టెస్లా హెడ్‌కౌంట్ 2021 చివరిలో దాదాపు 1,00,000 నుంచి 2023 చివరి నాటికి 1,40,000కి పెరిగింది. అయితే ఇప్పుడు ఇందులో దాదాపు 14,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు తెలుస్తోంది.
టెస్లాలో ఉద్యోగుల కోతలకు సంబంధించిన ప్రకటన తర్వాత షేర్ ధర అమెరికా మార్కెట్లలో 5.6 శాతం క్షీణించి 161.48 డాలర్లకు చేరుకుంది. పైగా ప్రకటన రివియన్ ఆటోమోటివ్, లూసిడ్ గ్రూప్, విన్‌ఫాస్ట్ ఆటో వంటి కంపెనీలను ప్రభావితం చేసింది. మోడల్ 2 అని పిలవబడే దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సరసమైన వాహనాన్ని టెస్లా రద్దు చేసినట్లు తెలుస్తోందని రాయిటర్స్ నివేదించింది. ఈ ప్రాజెక్ట్ రద్దు తర్వాత ఉద్యోగులు, వ్యాపారాన్ని క్రమబద్దీకరించాలని టెస్లా నిర్ణయించిందని తెలుస్తోంది. దీనికి బదులుగా టెస్లా తన దృష్టిని సెల్ఫ్ డ్రైవింగ్ రోబోటాక్సిస్ వైపు మళ్లిస్తున్నట్లు కనిపిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలతో రవాణాను విప్లవాత్మకంగా మార్చాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications