For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియోజిత్ గుడ్‌న్యూస్, ఏ దేశంలోనైనా షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు

|

ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా ఒకే ఖాతా ద్వారా అమెరికా మార్కెట్లతో పాటు ఇతర ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ బ్రోకేరేజీ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాంను తీసుకువచ్చింది. జియోజిత్ కస్టమర్లు వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ ప్లాట్‌ఫాం ఎంతో ఉపయోగపడుతుంది. విదేశీ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి దేశీయ ఇన్వెస్టర్లలో పెరుగుతుండటంతో ఇలాంటి వారి కోసం ఓ అంతర్జాతీయ పెట్టుబడుల ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది.

టాటాల నుండి రూ.1.75 లక్షల కోట్లు రావాలి: షాపూర్‌జీ పల్లోంజీ, TCS నుండి లక్ష కోట్లకు పైగా!టాటాల నుండి రూ.1.75 లక్షల కోట్లు రావాలి: షాపూర్‌జీ పల్లోంజీ, TCS నుండి లక్ష కోట్లకు పైగా!

దీని ద్వారా ప్రపంచంలోని ఎక్కడి నుండి అయినా ఒకటే ఖాతా ద్వారా అమెరికా సహా ప్రపంచ సెక్యూరిటీస్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకు జియోజిత్... న్యూయార్క్ గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్లాట్‌ఫాం స్టాకాల్ భాగస్వామ్యంతో కృత్రిమ మేధ(AI) ఆధారిత గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేసింది. ప్రపంచ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌పోలియోలో వైవిధ్యాన్ని తెచ్చుకునేందుకు ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుందని తెలిపింది.

Geojit launches global investment platform

ఈ క్యాలెండర్ ఏడాదిలో ప్రపంచ మార్కెట్లలో దేశీయ చిన్న ఇన్వెస్టర్లు రూ.350 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. తమ ప్లాట్ ఫాం ద్వారా రోజుకు సగటున భారత్ నుండి 2 మిలియన్ డాలర్ల ట్రాన్సాక్షన్స్ నమోదవుతున్నట్లు స్టాకాల్ వ్యవస్థాపకులు, సీఈవో శ్రీవాస్తవ తెలిపారు. ఆపిల్, గూగుల్, అమెజాన్, టెస్లాతో పాటు బంగారం వంటి కమోడిటీస్‌లలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.

English summary

జియోజిత్ గుడ్‌న్యూస్, ఏ దేశంలోనైనా షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు | Geojit launches global investment platform

Geojit Financial Services has partnered with New York-based global wealth management services platform Stockal to develop the AI-powered global investment platform which helps investors diversify their portfolio by investing in international equities.
Story first published: Friday, October 30, 2020, 19:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X