IT News: ఐటీ ఉద్యోగులకు హెచ్చరిక.. 60 వేల ఉద్యోగాలకు ఎసరు.. జాగ్రత్త
IT News: గత కొన్ని నెలలుగా భారతీయ ఐటీ ఉద్యోగులతో పాటు ప్రపంచవ్యాప్తంగా టెక్కీలను భయం వెంటాడుతోంది. మారుతున్న పరిస్థితులతో అనేక మంది గందరగోళంలో ఉన్నారు. అలాగే మార్చిలో జీతాల పెంపుపై ఇప్పటికే కంపెనీలు తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చాయి.
విదేశీ ఐటీ సర్వీస్ కంపెనీలైన యాక్సెంచర్, కాగ్నిజెంట్ బహిరంగంగా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించగా.. భారత ఐటీ కంపెనీలు మాత్రం తమ ఖర్చులను తగ్గించుకోవడానికి పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించాయి. దీంతో దేశంలోని అగ్ర ఐటీ కంపెనీలు నియామకాలను బాగా తగ్గించాయి లేదా దాదాపు నిలిపివేశాయని చెప్పుకోవాలి. ఈ క్రమంలో టీసీఎస్ ట్రాన్స్ అమెరికాతో డీల్ 10 ఏళ్లు పూర్తి కాకుండానే ముగించుకుంది.

ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కంపెనీలు నూతన ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చూస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆదాయాన్ని పొందేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ మార్పులు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నప్పటికీ.. దాదాపు 60,000 మంది టెక్కీలు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దాదాపు 54 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్న భారతీయ ఐటీ పరిశ్రమలో ఏఐ వినియోగం పెరగడం వల్ల 1 శాతం విక్రయాలు, శ్రామికశక్తికి మద్దతుగా ఉపాధిపై ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. 245 బిలియన్ డాలర్లు విలువైన భారత ఐటీ రంగంలో దాదాపు మూడు లక్షల మంది సేల్స్ అండ్ సపోర్ట్ లో పనిచేస్తున్నారు. అయితే అధ్యయనం ప్రకారం రాబోయే 3-5 సంవత్సరాల్లో AI పెరుగుదల వల్ల దాదాపు 50,000 నుంచి 60,000 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని వెల్లడైంది. వీరి స్థానాలను ఏఐ భర్తీ చేస్తుందని అన్‌ఎర్త్‌ఇన్‌సైట్ వ్యవస్థాపకుడు, CEO గౌరవ్ వాసు తెలిపారు.
భారతీయ IT సేవల కంపెనీలు ప్రాథమికంగా AI సాంకేతికతను ప్రధానంగా ఖర్చు తగ్గించే సాధనంగా ఉపయోగిస్తాయి. అలాగే దీర్ఘకాలిక ప్రాతిపదికన ఐటీ సర్వీస్ కంపెనీలు తమ బీపీవో సేవలతో పాటు ఏఐ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు అదనపు సేవలను అందించనున్నాయని వెల్లడైంది.


Click it and Unblock the Notifications