భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. జీడీపీ వృద్ధి రేటు 1947 కనిష్టానికి చేరుకోవచ్చునని హెచ్చరించారు. కరోనా మహమ్మారి కారణంగా దేశ జీడీపీ కనిష్టస్థాయికి పడిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఈ గణాంకాలు నెగిటివ్‌గా వచ్చినా ఆశ్చర్యం లేదని, ఇందుకు అన్ని రంగాలు సిద్ధంగా ఉండాలని కూడా సూచించారు.

వారిని వెనక్కి తీసుకువస్తేనే గాడిలో ఆర్థిక వ్యవస్థ
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన వర్చువల్ చర్చా గోష్టిలో దేశ ఆర్థిక వృద్ధిరేటు తీరుతెన్నులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు నారాయణమూర్తి. కరోనా కారణంగా ఇప్పటికే నేలచూపులు చూస్తున్న జీడీపీ వృద్ధి రేటు ముందుముందు మరింత దిగజారి స్వాతంత్య్రానంతరం ఎప్పుడూ లేని కనిష్టానికి పడిపోవచ్చునన్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలని, పని ప్రదేశాల నుంచి గ్రామాలకు తిరిగివెళ్లిన వలస కార్మికులను వెనక్కు తీసుకురావడం ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. 140 మిలియన్ల మంది కార్మికులు పని ప్రదేశాలకు తిరిగి రావాలన్నారు.

వ్యాక్సీన్ వచ్చినా.. టీకాలకు రెడీగా ఉండాలి
మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతిరంగంలోని అన్ని వ్యవస్థలు కూడా తగిన ముందు జాగ్రత్తలతో తిరిగి పూర్తిస్థాయిలో పని చేయగలిగే వ్యవస్థని అందుబాటులోకి తీసుకు రావాలని నారాయణమూర్తి అన్నారు. ప్రపంచ జీడీపీ, వాణిజ్యం తీవ్రంగా పతనమయ్యాయని, ప్రయాణాలు లేకుండా పోయాయని, జీడీపీలో 5 శాతం నుండి 10 శాతం వరకు క్షీణించవచ్చునన్నారు. ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సీన్ విడుదల చేసినప్పటికీ, అది మన దేశానికి రావడానికి ఆరు నుండి తొమ్మిది నెలలు పట్టవచ్చునని చెప్పారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితిని అధిగమించాలని, ఇందుకు సరికొత్త వ్యవస్థను అభివృద్ధి చెయాలన్నారు. అంతేకాదు, వ్యాక్సీన్ రాగానే చాలా వేగంగా ప్రతి ఒక్కరికి టీకాలు వేయగలిగే మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలన్నారు. రోజుకు కోటి మందికి టీకాలు వేసినా, అందరికీ వేయడానికి 140 రోజుల సమయం పడుతుందన్నారు.

మాస్క్, సామాజిక దూరం తప్పనిసరి
వైరస్‌తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలన్నారు. ప్రభుత్వాలు కూడా ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచాలని, పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలన్నారు. టైర్ 2, 2 పట్టణాల్లో సౌకర్యాల కొరత ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications