ఆసియా, భారత కుబేరుడు ముఖేష్ అంబానీని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దాటేశారు. తద్వారా ఆసియా నెంబర్ వన్ ఆస్తిపరుడిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం సోమవారం నాడు ఈ 59 ఏళ్ల అదానీ సంపద 88.5 బిలియన్ డాలర్లు కాగా, ముఖేష్ అంబానీ సంపద 87.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ క్యాలెండర్ ఏడాదిలో (2022) అదానీ సంపద 12 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచంలోనే ఈ ఏడాది అత్యంత ఎక్కువగా సంపాదించిన వారిలో అదానీయే ముందు ఉన్నారు. ఈ కోల్-మాగ్నేట్ ఆస్ట్రేలియన్ మైన్ ప్రాజెక్ట్ పైన వాతావరణ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఐతే ఇటీవలి కాలంలో అదానీ పునరుత్పాదక ఇంధనం, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, రక్షణ కాంట్రాక్టులోకి వెళ్తున్నారు.

600 శాతం జంప్
అదానీ గ్రూప్ సరైన సమయంలో సరైన అంశాలపై దృష్టి సారించిందని, ఇది విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడిదారుల వైపు మళ్లిందని చెబుతున్నారు. గత రెండేళ్ల కాలంలో అదానీ గ్రూప్‌కు చెందిన పలు లిస్టింగ్ స్టాక్స్ 600 శాతం కూడా లాభపడ్డాయి. 2070 నాటికి భారత్‌ను జీరో కార్బన్ దేశంగా చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకొని, ముందుకు సాగుతోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోని అదానీకి ఇది అద్భుత ప్రయోజనంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ స్టాక్స్ ఆరువందల శాతం మేర లాభపడ్డాయి. MSCI ఇంక్ తన భారతీయ బెంచ్ మార్క్ ఇండెక్స్‌లో మరిన్ని అదానీ కంపెనీలను చేర్చడానికి తీసుకున్న నిర్ణయం కూడా ఉపయోగపడింది.

గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు
2020లో అంబానీ సంపద భారీగా పెరిగింది. చమురు నుండి పెట్రోకెమికల్స్ వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కలిసి వచ్చింది. ఫేస్‌బుక్, గూగుల్ ఇంక్‌లు ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో ముఖేష్ కంపెనీకి పెద్ద ఎత్తున సంపద సమకూరింది. అయితే గత రెండేళ్లుగా సంపద వృద్ధి అంబానీ నుండి అదానీ వైపు మళ్లింది. శిలాజ ఇంధనాలు లేదా బొగ్గుపై తమ సామ్రాజ్యాలను నిర్మించుకున్న ఈ ఇద్దరు భారతీయ బిలియనీర్లు ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు.

పెట్టుబడులు
రెన్యువబుల్స్‌లో 76 బిలియన్ డాలర్ల వ్యయ ప్రణాళికలో భాగంగా అంబానీ రాబోయే మూడేళ్లలో 10 బిలియన్ల డాలర్లకు కట్టుబడి ఉన్నారు. అదానీ 2030 నాటికి 70 బిలియన్ల డాలర్ల పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక శక్తి ఉత్పత్తిదారుగా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 2021లో వార్‌బర్గ్.. అదానీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications