September 1st: సెప్టెంబర్ 1 నుంచి అనేక మార్పులు రాబోతున్నాయి. వీటిలో కొన్ని మన జీవితాలను ప్రభావం చేస్తాయి. మరికొన్ని ఆర్థికంగా ముడిపడి ఉంటాయి. ఏ మార్పుల వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. వాటి వల్ల మనకు ఉండే ప్రయోజనాలు లేదా నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్యాస్ సిలిండర్ ధరలు..
ప్రతి నెల ప్రారంభంలో దేశీయ చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధరను బట్టి గ్యాస్ ధరల్లో మార్పులను ప్రకటిస్తుంటాయి. కాబట్టి సెప్టెంబర్ 1 నుంచి వంటగ్యాస్ ధరలో మార్పు ఉండవచ్చు. అయితే గడచిన రెండు నెలల్లో కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కొంత ఊరట లభించినప్పటికీ.. సామాన్య గృహ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి ఊరట లభించలేదు. ఈ సారైనా ధరల భారం తగ్గుతుందేమోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.

టోల్ ఫీజుల పెంపు..
యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ.. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ ఛార్జీలను పెంచింది. ఇది ఆగ్రా-నోయిడాలను కలిపే ఎక్స్‌ప్రెస్ వే. గ్రేటర్ నోయిడా నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు రేపటి నుంచి అమలులోకి వస్తున్నాయి. ప్రతి 3.25 కిలోమీటర్లకు 15 పైసలు చొప్పున ధరల్లో పెరుగుదల వచ్చింది. అయితే వాహనాన్ని బట్టి ఈ రుసుము మారుతూ ఉంటుంది. దీని ప్రకారం కిలోమీటరుకు కనీస ఛార్జీ ఇకపై రూ.2.65కు చేరుకుంటుంది. మినీ బస్సులు, చిన్న గూడ్స్ వాహనాలు వంటి తేలికపాటి వాహనాలకు కిలోమీటరుకు రూ.4.15 టోల్‌ను పెంచారు. బస్సులు, ట్రక్కులకు కిలోమీటరుకు రూ.8.45, లాంగ్ వాహనాలకు రూ.12.90, పెద్ద వాహనాలకు కిలోమీటరుకు రూ.18.80కి టోల్ ఉండనుంది.

ఆస్తుల ధరలు పెరగవచ్చు..
ఘజియాబాద్‌లో రియల్ ఎస్టేట్ సర్కిల్ రేట్లు సెప్టెంబర్ 1 నుంచి పెరగనున్నాయి. వీటి పెంపు కారణంగా సదరు ప్రాంతాల్లో ఆస్తి ధరలు పెంచవచ్చు. ఘజియత్ ప్రాంతంలో ఆస్తిని కొనుగోలు చేయాలనుకునే వారిపై ఇది ప్రభావం చూపుతుంది. ఇకపై ఆ ప్రాంతంలో ఆస్తులు కొనాలనుకునేవారికి ఇది అదనపు ఖర్చు కలిగించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

నేషనల్ పెన్షన్ స్కీమ్..
నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో కొన్ని నిబంధనలు మారాయి. POPలలో ఈ ఖాతాను తెరిచినందుకు కమీషన్ చెల్లించబడుతుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు POPలలో నిమగ్నమై ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పాల్గొన్న వ్యక్తులకు రిజిస్ట్రేషన్, ఇతర ప్రయోజనాలను కూడా ఉంటాయి. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని కోసం మీరు 10 రూపాయల నుంచి రూ.15,000 వరకు కమీషన్‌గా పొందుతారు.

తక్కువ ప్రీమియం చెల్లించండి..
ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించే కమీషన్‌ను బీమా ఏజెంట్లకు మాత్రమే పరిమితం చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) తెలిపింది. ఇది 20% లోపు ఉండాలని సిఫార్సు చేసింది. అంతకుముందు ఇది 30-35%గా ఉండేది. దీంతో పాలసీదారులు చెల్లించాల్సిన ప్రీమియం తగ్గి వారికి ఉపశమనం కలుగుతుంది. కొత్త నోటిఫికేషన్ త్వరలోనే అమలులోకి రానుంది.

PNB కేవైసీ నిబంధనలు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లను ఆగస్టు 31లోపు ఎట్టిపరిస్థితుల్లోనూ KYCని పూర్తి చేయాలని కోరింది. అలా చేయడంలో విఫలమైతే సెప్టెంబర్ 1 నుంచి ఖాతాదారుకు సేవలు పొందటంలో సమస్యలు రావచ్చు. దీనికి సంబంధించి బ్యాంక్ గత నెల రోజులుగా వినియోగదారులకు సందేశం పంపుతూ సమీప బ్యాంక్ బ్రాంచ్ లో కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని హెచ్చరిస్తోంది.

ఆడి కార్ల ధరలు పెంపు..
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఆడి సెప్టెంబర్ 2022 నుంచి తన కార్ మోడళ్ల ధరలను పెంచుతుందని తెలుస్తోంది. ఇది ఇప్పటికే గత ఏప్రిల్‌లో కూడా ధరలను 2.4% పెంచింది. లాజిస్టిక్స్ ఖర్చులు, మూలధన వ్యయం పెరగడం వంటి కారణాలు ధరల పెరుగుదలకు కారణమని కంపెనీ పేర్కొంది. అయితే పండుగల సీజన్ నడుస్తున్నందున చాలా మంది కారు ప్రియులకు ఇది కొంత చేదు వార్తనే చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications