LPG Cylinder Price: కొత్త నెల ప్రారంభంలోనే LPG సిలిండర్ల కొత్త రేట్లు వచ్చాయి. ఆగస్టు మొదటి తేదీన దేశంలోని ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో కొంత తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈరోజు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.36 తగ్గింది. ఈ తగ్గింపు కారణంగా 19 కిలోల సిలిండర్ ధర ఢిల్లీ, ముంబై, చెన్నైతో పాటు దేశంలోని అన్ని ఇతర నగరాలకు వర్తిస్తాయి.

తగ్గిన గ్యాస్ రేట్లు ఇలా..
కొత్త నెల ప్రారంభంలో గ్యాస్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు ఊరటనిచ్చాయి. తగ్గించిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.1,976.50, కోల్ కతాలో రూ.2,095.50 , ముంబైలో రూ.1,936.50 , చెన్నైలో రూ.2,141గా ఉన్నాయి. కొత్త రేట్లు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.

గతంలో రేట్లు ఇలా..
మూడు నెలల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల తగ్గింపు ఇది నాలుగోసారి. ఇంతకు ముందు సిలిండర్‌ను రూ.2,012కు విక్రయించేవారు. చివరిగా రేట్ల సవరణ జూలై 6, 2022న జరిగింది. అప్పుడు సిలిండర్ పై ధర రూ.9 మేర తగ్గింది. అంతకుముందు.. జూలై 1, 2022న వాణిజ్య సిలిండర్ ధర రూ.198 తగ్గింది. అంతకు ముందు దీని ధర రూ.2,022గా ఉండేది. జూన్ నుంచి వాణిజ్య సిలిండర్ ధర రూ.378 తగ్గింది.

డొమెస్టిక్ సిలిండర్ల రేట్లు..
అయితే.. ఈరోజు డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పులను కంపెనీలు ప్రకటించలేదు. అదే సమయంలో గత నెల సిలిండర్‌పై రూ.50 పెరిగింది. దేశంలో 14.2 కిలోల నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగుతున్నాయి. వీటి ధరలు ఢిల్లీలో రూ.1,053, కోల్ కతాలో రూ.1,079 , ముంబైలో రూ.1,052.50 , చెన్నైలో రూ.1,068.50 గా ఉన్నాయి. ఈ రేట్లు జూలై 6, 2022 నుంచి ఆలాగే కొనసాగుతున్నాయి.

సామాన్యులకు దక్కని ఊరట..
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గుముఖం పట్టినా.. మరోవైపు వంటగ్యాస్‌పై సామాన్య ప్రజలకు ఎలాంటి ఊరట లభించడం లేదు. జూలై వరకు ఉన్న లెక్కలను పరిశీలిస్తే.. ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్ల ధరలు నాలుగుసార్లు పెరిగాయి. సరిగ్గా ఏడాది క్రితంతో పోల్చినట్లయితే ఆగస్టు 2021లో.. 14.2 కిలోల నాన్-సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర సిలిండర్‌కు రూ.859గా ఉంది. కానీ అది ఇప్పుడు రూ.1,053 వద్ద ఉంది. అంటే ఈ కాలంలో దాదాపు రూ.200 డొమెస్టిక్ సిలిండర్ రేట్లు పెరిగాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications