ముంబై: ఈ వారం మొత్తం కూడా స్టాక్ మార్కెట్‌లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సందడి కనిపించింది. ఏకంగా అయిదు ఐపీఓలు ఒకే తేదీన మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చాయి. లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టాయి. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఐపీఓను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఆరుకు చేరుతుంది.
టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీ, ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్ఎంఈ సెగ్మెంట్‌లో రాకింగ్ డీల్స్ సర్కులర్ ఎకానమీ లిమిటెడ్.. తమ పబ్లిక్ ఇష్యూలను జారీ చేశాయి. అవన్నీ కూడా ఈ నెల 22వ తేదీన ఓపెన్ అయినవే. 24వ తేదీన క్లోజ్ అయ్యాయి.

ఈ మూడు రోజుల వ్యవధిలో ఈ అయిదు ఐపీఓలు రాబట్టుకున్న ఇన్వెస్ట్‌మెంట్ విలువ.. 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. ఇదో రికార్డు. పబ్లిష్ ఇష్యూలను జారీ చేయడం ద్వారా ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులను సమీకరించిన మరో ఐపీఓలు ఈ మధ్యకాలంలో లేవు.
మూడు రెగ్యులర్ పబ్లిక్ ఇష్యుల్లో టాటా టెక్నాలజీస్ టాప్‌లో నిలిచింది. ఇష్యూ చేసిన వేల్యూ కంటే 69.43 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రిప్షన్‌ను సాధించిందీ సంస్థ. దీని విలువ 1.56 లక్షల కోట్ల రూపాయలు. 4.5 కోట్ల పబ్లిక్ ఇష్యూలను జారీ చేయగా 312 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి.
టాటా టెక్నాలజీస్‌తో పోటీ పడింది గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఐపీఓ. ఇష్యూ చేసిన మొత్తం కంటే 64.07 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్‌ను రికార్డు చేసింది. 2.12 కోట్ల షేర్లను జారీ చేయగా.. 136.1 కోట్లకు బిడ్డింగులు దాఖలయ్యాయి. వీటి విలువ 23,000 కోట్ల రూపాయలు. ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ మూడో స్థానంలో నిలిచింది. 46.68 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్లను నమోదు చేసింది.
ఇందులో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ 64 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 62.23 శాతం మేర బిడ్స్ దాఖలు చేశారు. పబ్లిక్ ఇష్యూ క్లోజ్ అయ్యే సమయానికి గాంధార్ ఆయిల్ గ్రే మార్కెట్ ప్రీమియం 77 రూపాయలుగా పలికింది. అంటే ఒక్కో షేర్ కటాఫ్ ధర కంటే 77 రూపాయల మేర అధికంగా స్టాక్ మార్కెట్స్‌లో ఇది లిస్టింగ్ అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
More From GoodReturns

ఇన్వెస్టర్లు డబ్బులతో రెడీగా ఉండండి.. దేశ చరిత్రలోనే అతిపెద్ద IPO..రూ. 20 వేల కోట్ల టార్గెట్‌తో వస్తున్న NSE.

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

Paskistan: పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్‌లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications