ముంబై: ఇంగ్లాండ్ జాతీయ మహిళా క్రికెట్ జట్టుతో టీ20 సిరీస్‌లో తలపడిన భారత జట్టు.. మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. విమెన్ క్రికెటర్ హర్లీన్ డియోల్ బౌండరీ లైన్ వద్ద పట్టిన స్టన్నింగ్ క్యాచ్ సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. నార్తాంప్టన్ కంట్రీ గ్రౌండ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయినప్పటికీ- ప్రశంసలు సునామీ కురిసింది. మ్యాచ్ ఓటమి మిగిల్చిన నిరాశను తుడిచి పెట్టేసింది. అమీ జోన్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో చోటు చేసుకుందీ అద్భుతం.
19వ ఓవర్ వేసిన భారత పేసర్ శిఖా పాండే బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా జోన్స్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ వద్ద హర్లీన్ దాన్ని అందుకున్న తీరు హేమాహేమీలను సైతం కట్టి పడేసింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్ డియోల్.. సిక్స్‌గా వెళ్తోన్న ఆ బంతిని గాల్లోకి ఎగిరి అందుకుంది. ఈ క్రమంలో ఆమె తన బ్యాలెన్స్ కోల్పోయింది. బంతితో సహా బౌండరీ లైన్ లోపలికి వెళ్లబోయింది. దీన్ని గమనించిన వెంటనే హర్లీన్ డియోల్..మెరుపువేగంతో బంతిని బౌండరీకి ఇవతల గాల్లోకి విసిరేసింది.

బౌండరీ లైన్ లోపల అడుగుపెట్టి.. మళ్లీ దాన్ని డైవ్ చేసి క్యాచ్‌గా అందుకుంది. ఈ ప్రయత్నంలో హర్లీన్ డియోల్ చేసిన జంప్.. నివ్వెరపోయేలా చేసింది. ఇది సాధ్యమేనా? అనిపించింది. కొన్ని అడుగుల మేర గాల్లోకి చిరుతపులిలా దూకిందామె. బంతి గ్రౌండ్‌కు చేరేలోపు దాన్ని అందుకుంది. హర్లీన్ డియోల్ క్యాచుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. డియోల్ పట్టిన క్యాచ్ చూసి మాజీ క్రికెటర్లతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ప్రశంసించకుండా ఉండలేకపోయారు.
రియల్ సూపర్ ఉమెన్ అంటూ ఆనంద్ మహీంద్రా ఆమె ఆకాశానికెత్తేశారు. ఈ మేరకు ఆయన ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు. ఈ క్యాచ్‌ను అందుకోగలుగుతుందని తాను ఏ మాత్రం ఊహించలేదని ఏదైనా అద్భుతం జరిగితే తప్ప దాన్ని క్యాచ్‌గా మలచలేరని చెప్పారు. అలాంటి అద్భుతాన్ని రియల్ వండర్ విమెన్ చేసి చూపించారని ప్రశంసించారు. క్రికెట్ క్యాచుల్లో దీన్ని ద బెస్ట్ అని పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి ఫీట్స్ పురుషులు ఆడే మ్యాచ్‌ల్లో అధికంగా కనిపిస్తుంటాయి. తాను వారికి ఏమాత్రం తక్కువ కాదని హర్లీన్ డియోల్ నిరూపించినట్టయిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. నటాలియా సివర్, జోన్స్ రాణించారు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి క్రీజ‌్‌లోి దిగిన భారత్ జట్టు 8.4 ఓవర్లు ముగిసే సమయానికి 54/3తో నిలిచిన దశలో వర్షం పడింది. దీనితో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లాండ్ 18 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో టీ20 ఆదివారం జరగనుంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications