ముంబై: ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకులు ఓ భాగం అయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలను సందర్శించని వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. 95 శాతం మంది ప్రజలు ఏదో ఒక సందర్భంలో బ్యాంకులు, ఏటీఎం సేవలను వినియోగించుకుని ఉంటారంటూ కొన్ని సర్వేలు స్పష్టం చేస్తోన్నాయి.
తమ నగదు మొత్తాలను భద్రపరచుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీస్ తప్ప మరో ప్రత్యామ్నాయం అందుబాటులో లేదు. ఫలితంగా ప్రజల దైనందిన జీవితంలో అవి కీలక పాత్ర పోషిస్తోన్నాయి. అలాంటి బ్యాంకులు ఒక్క రోజు మూత పడినా వందల కోట్ల రూపాయల మేర కార్యకలాపాలు స్తంభించిపోతుంటాయి.

సాధారణ సెలవు రోజులను మినహాయిస్తే.. సమ్మెలు, బంద్‌లల్లో దీని తీవ్రత అధికంగా కనిపిస్తుంటుంది. ఇదిలావుండగా- బ్యాంకుల సెలవులకు సంబంధించిన పూర్తి జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెలా చివరి వారంలో జారీ చేస్తుంటుంది. ఈ సారి కూడా ఆ ఆనవాయితీని కొనసాగించింది.
డిసెంబర్ నెల మొత్తానికీ దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవు రోజులను పొందుపరిచిన కంప్లీట్ లిస్ట్‌ను విడుదల చేసింది. సాధారణంగా మూడు కేటగిరీల్లో బ్యాంకుల హాలిడేలను ప్రకటిస్తుంటుంది రిజర్వు బ్యాంకు. ఒకటి- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రెండు- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, మూడు- బ్యాంక్స్ క్లోసింగ్ ఆఫ్ అకౌంట్స్.
ఈ మూడింట్లో మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తుంటుంది. నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద.. డిసెంబర్ నెల మొత్తంగా ఏడు సెలవులు ఉంటాయి బ్యాంకులకు. ఇవి పోను- ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో.. అక్కడి ప్రజల సంప్రదాయాలు, పండుగలు, తిథులను అనుసరించి జారీ చేసే సెలవులు అదనం.
రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాల్లో బ్యాంకులకు యధాతథంగా సెలవులు అమలులో ఉంటాయి. ఆదివారం కూడా పనిచేసే శాఖా కార్యాలయాలకు మినహయింపు ఉంటుంది. రాష్ట్రాలు, పండుగలు, తిథుల వారీగా రిజర్వుబ్యాంకు విడుదల చేసిన జాబితా ప్రకారం.. అక్టోబర్‌లో మొత్తంగా 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
డిసెంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. 3వ తేదీన ఆదివారం, 4వ తేదీన ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వేడుకల సందర్భంగా గోవాలో బ్యాంకులకు హాలిడే. 9, 10 తేదీల్లో శని, ఆదివారాలు సెలవు ఉంటుంది.
డిసెంబర్ 12న మేఘాలయా, 13, 14 తేదీల్లో లోసంగ్/నమ్సంగ్ పురస్కరించుకుని సిక్కింలో బ్యాంకులు పని చేయవు. 17వ తేదీన ఆదివారం సెలవు ఉంటుంది. 18వ తేదీన యు సొసొ థమ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయాలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. లిబరేషన్ డే సందర్భంగా 19న గోవాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
డిసెంబర్ 23వ తేదీన నాలుగో శనివారం, 24వ తేదీన ఆదివారం, 25వ తేదీన క్రిస్మస్ వల్ల దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. క్రిస్మస్ వేడుకల కొనసాగింపుగా 26న మిజోరం, నాగాలాండ్, మేఘాలయాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. 27వ తేదీన నాగాలాండ్‌లో బ్యాంకులకు హాలిడే. 30న మేఘాలయాల్లో బ్యాంకులు మూతపడతాయి. 31వ తేదీన ఆదివారం సెలవు ఉంటుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications