క్రూడ్ ధర అనూహ్యం: పెట్రోల్, డీజిల్ ధరల్లో

ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 95.79 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 88.27 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. కొద్దిరోజులుగా బ్రెంట్ క్రూడ్ రేట్ 94-96 డాలర్ల మధ్య కదలాడుతోంది.

కొంతకాలంగా స్థిరంగా ఉండటం అనూహ్య పరిణామంగా భావిస్తోన్నాయి మార్కెట్ వర్గాలు. బ్యారెల్ రేటు 70 డాలర్ల వరకూ క్షీణించవచ్చనే అంచనాలు వ్యక్తమైనప్పటికీ.. 85 డాలర్లకు దిగువకు కూడా చేరట్లేదు. ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ఇవ్వాళ్టి కొత్త ధరల ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది.

ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది.

Fuel rates on August 21, 2022: Petrol and Diesel price was remain steady

బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది.

హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి.

రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వ్యాట్‌ను తగ్గించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+