ఆరు నెలల కనిష్ఠానికి క్రూడాయిల్ ధర: ఆ కంపెనీలకు మాత్రమే కేంద్రం ఊరట

ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు దిగొస్తోన్నాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా వాటి రేట్లు తగ్గుతూ క్రమంగా వస్తోన్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 96.44 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 90.39 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. ఆరు నెలల కనిష్ఠానికి పతనమైన క్రూడాయిల్ ధర ఇవ్వాళ స్వల్పంగా పెరిగింది.

విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు..

విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు..

కొంతకాలంగా క్రూడాయిల్ మార్కెట్‌లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. బ్యారెల్ రేటు 70 డాలర్ల వరకూ క్షీణించవచ్చనే అంచనాలు క్రూడ్ మార్కెట్‌లో వ్యక్తమౌతోన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం తగ్గించింది. క్రూడాయిల్ టన్ను ఒక్కింటికి 13,000 రూపాయల మేర తగ్గింపు ప్రకటించింది. ఇదివరకు ఈ మొత్తం 17,750 రూపాయలుగా ఉండేది.

డీజిల్‌ ఎగుమతులపై..

డీజిల్‌ ఎగుమతులపై..

డీజిల్‌ ఎగుమతులపై ఎక్సైజ్ డ్యూటీని లీటర్ ఒక్కింటికి ఏడు రూపాయలకు పెంచింది. సెస్‌ను ఇందులోనే కలిపింది. ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ మీద రెండు రూపాయల మేర ఎగుమతి సుంకాన్ని విధించింది. ఇప్పటివరకు ఏటీఎఫ్ మీద ఈ సుంకం ఉండేది కాదు. పెట్రోల్ ఎగుమతులను ఎక్స్సైజ్‌ డ్యూటీ నుంచి మినహాయింపునిచ్చింది. జులై 1వ తేదీ తరువాత విండ్ ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం పునఃసమీక్షించడం ఇది మూడోసారి.

ఇవ్వాళ్టి కొత్త రేట్లివే..

ఇవ్వాళ్టి కొత్త రేట్లివే..

ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ఇవ్వాళ్టి కొత్త ధరల ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం రెండోసారి వ్యాట్‌ను తగ్గించిన తరువాత ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.

బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది.

 హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో..

అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.

 వ్యాట్ తగ్గింపుపై..

వ్యాట్ తగ్గింపుపై..

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+