కేంద్రం మీద గంపెడాశలు పెట్టుకున్నా గానీ..!!

ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర స్థిరంగా కొనసాగుతోంది. మొన్నటివరకు 100 డాలర్లకు చేరువగా కనిపించిన క్రూడాయిల్ రేటు ప్రస్తుతం 90 పడిపోయింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 90.80 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో ఈ ధర 84.61 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది.

రేట్ల తగ్గింపుపై..

రేట్ల తగ్గింపుపై..

ఇదివరకు ముడిచమురు ధరలకు అనుగుణంగా భారీగా పెట్రో రేట్లను పెంచుకుంటూ పోయాయి ఆయిల్ కంపెనీలు. రేటు తగ్గుతోండటం వల్ల సానుకూల నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అనేది కేంద్రం మీదే డిపెండ్ అయి ఉంది. గత ఏడాది దీపావళి సీజన్‌లో కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే.

తాయిలాలు ఆశించినా..

తాయిలాలు ఆశించినా..

ఇప్పుడు కూడా అలాంటి తాయిలాలు ఉండొచ్చని ఆశించిన వాహనదారులకు నిరుత్సాహమే మిగిలింది. ఇంధన రేట్లు వంద రూపాయలకు పైగానే ఉంటోన్నాయి. పైగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ రేట్లు కూడా పెద్దగా భయపెట్టట్లేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మరో తగ్గింపు ఉండొచ్చని గంపెడాశలు పెట్టుకున్నా దానిపై కేంద్రం నీళ్లు చల్లింది.

ఇవ్వాళ్టి కొత్త రేట్లివే..

ఇవ్వాళ్టి కొత్త రేట్లివే..

క్రూడాయిల్ ధర స్థిరంగా కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే పెట్రోల్, డీజిల్ రేట్లను జారీ చేశాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.

 విశాఖలో..

విశాఖలో..

కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది.

 హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో..

అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.

వ్యాట్ ఒత్తిడి..

వ్యాట్ ఒత్తిడి..

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. ఫలితంగా అక్కడ వాటి రేట్లు మరింత తగ్గుముఖం పట్టాయి.

 బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ..

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ..

బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వ్యాట్‌ను తగ్గించింది. ఇప్పుడు నిర్మల సీతారామన్ చేసిన ప్రకటనలో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది.. వాహనదారుల్లో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+