ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర స్థిరంగా కొనసాగుతోంది. మొన్నటివరకు 100 డాలర్లకు చేరువగా కనిపించిన క్రూడాయిల్ రేటు ప్రస్తుతం 90 పడిపోయింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 91.83 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో ఈ ధర 84.29 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది.
ఇదివరకు ముడిచమురు ధరలకు అనుగుణంగా భారీగా పెట్రో రేట్లను పెంచుకుంటూ పోయాయి ఆయిల్ కంపెనీలు. రేటు తగ్గుతోండటం వల్ల సానుకూల నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అనేది కేంద్రం మీదే డిపెండ్ అయి ఉంది. క్రూడాయిల్ ధర స్థిరంగా కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే పెట్రోల్, డీజిల్ రేట్లను జారీ చేశాయి.

ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది.
లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది.
తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వ్యాట్‌ను తగ్గించింది. ఇప్పుడు నిర్మల సీతారామన్ చేసిన ప్రకటనలో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది.. వాహనదారుల్లో.
More From GoodReturns

పెట్రోల్,డీజిల్ ధరల షాక్.. ఒక్కసారిగా రూ.55 పెంపు.. ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్

హార్ముజ్ జలసంధి మూసివేత.. సముద్ర జల్లాలోకి ఏ దేశం నౌక వచ్చినా పేల్చేస్తామని ఇరాన్ కీలక ప్రకటన..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

చమురు ధరలు పెరిగినా పెట్రోల్, డిజీల్ ధరలు పెరగవు.. సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications