ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. మొన్నటివరకు 100 డాలర్లకు చేరువగా కనిపించిన క్రూడాయిల్ రేటు ఇవ్వాళ చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 91.46 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో ఈ ధర 85.55 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. మొన్నటివరకు ఈ రెండింటి ధరలు 94 నుంచి 99 డాలర్ల వరకు వెళ్లాయి.

తగ్గింపుపై..
క్రూడాయిల్ ఉత్పత్తిని రెండు మిలియన్ బ్యారెళ్లకు ఒపెక్ ప్లస్ దేశాలు తగ్గించిన నేపథ్యంలో- వాటి రేట్లు క్రమగా పెరగడం మొదలు పెట్టాయి. అక్కడ పరిస్థితులు కుదుటపడటంతో ధర దిగి వస్తోంది. ఇదివరకు ముడిచమురు ధరలకు అనుగుణంగా భారీగా పెట్రో రేట్లను పెంచుకుంటూ పోయాయి ఆయిల్ కంపెనీలు. రేటు తగ్గుతోండటం వల్ల సానుకూల నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అనేది కేంద్రం మీదే డిపెండ్ అయి ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ కేంద్రంపై ఆ ఆశలు సన్నగిల్లుతున్నాయి.

15 రోజుల్లో నిర్ణయం..
15 రోజుల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇదివరకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో పర్యటిస్తోన్నారు. స్వదేశానికి తిరిగొచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలపై సమీక్షించే అవకాశం ఉంది. కాగా ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ఇవ్వాళ్టి కొత్త ధరల ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది.

అవే రేట్లు..
ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది.

హైదరాబాద్‌లో..
లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది.

వ్యాట్ తగ్గింపుపై..
తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి.

మళ్లీ ఆశలు..
మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వ్యాట్‌ను తగ్గించింది. ఇప్పుడు నిర్మల సీతారామన్ చేసిన ప్రకటనలో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది.. వాహనదారుల్లో.
More From GoodReturns

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications