ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర ప్రస్తుతానికి స్థిరంగా ఉంది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 95.49 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో ఈ ధర 89.25 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. శుక్రవారం నాటితో పోల్చుకుంటే ఈ రెండు చోట్లా క్రూడ్ ట్రేడింగ్ ఫ్లాట్‌గా రికార్డయింది.
క్రూడాయిల్ ధర స్థిరంగా కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే పెట్రోల్, డీజిల్ రేట్లను జారీ చేశాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.

కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది.
అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. ఫలితంగా అక్కడ వాటి రేట్లు మరింత తగ్గుముఖం పట్టాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వ్యాట్‌ను తగ్గించింది. కాగా- హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి అవసరమైన నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అన్ని నియోజకవర్గాలకు ఈ నెల 12వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరుగనుంది.
దీని తరువాత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల రెండోవారంలో నోటిఫికేషన్ వెలువడొచ్చు. ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం- పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. లీటర్‌పై కనీసం 2 రూపాయల వరకు కుదించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధి మూసివేత.. భారత్‌కు ముంచుకొస్తున్న చమురు ముప్పు.. ఎంతలా అంటే..

చమురు ధరలు పెరిగినా పెట్రోల్, డిజీల్ ధరలు పెరగవు.. సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications