న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల్లో యధాతథ స్థితి కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత వాహనదారులకు కొంత ఊరట కలిగింది. పెట్రోల్‌పై 8, డీజిల్‌పై 6 రూపాయల మేర తగ్గించిన అనంతరం వాటి ధరలు శాంతించాయి. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.9.50 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 7 రూపాయల మేర తగ్గింది. అప్పటి నుంచి రేట్ల పెంపుదల చోటు చేసుకోలేదు. వాటి ధరల్లో యధాతథ స్థితి కొనసాగుతోంది.
దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ111.35 పైసలు, డీజిల్ రూ.97.28 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది.

లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.
కాగా- తమ కమీషన్ మొత్తాన్ని పెంచాలంటూ ఏపీ, తెలంగాణ సహా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, బిహార్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నార్త్ బెంగాల్ డీలర్స్ అసోసియేషన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పెట్రోల్ డీలర్ల అసోసియేషన్లు ఇవ్వాళ ఇంధనాన్ని కొనట్లేదు. దీని ఫలితం వాహనదారులపై పడే అవకాశం ఉంది.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Petrol prices: పెట్రోల్, డీజిల్‌పై రూ. 10 పన్ను తగ్గింపు.. అయినా సామాన్యులకు ఊరట లేదు! ఏందుకంటే..

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

భారీగా పెరిగిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై టికెట్ ఛార్జీల మోత తప్పదిక..

Oil prices: ముదురుతున్న యుద్ధం! ఊహించని స్థాయిలో ఆయిల్ రేట్లు పెరగనున్నాయా?

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications