ఇన్ని రోజులుగా.. పెట్రోల్, డీజిల్‌ ధరల్లో మార్పుల్లేకుండా: ఇంధన రేట్లివీ

న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల్లో యధాతథ స్థితి కొనసాగుతోంది. 40 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగట్లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదశలో క్రూడాయిల్ ధర సైతం భారీగా పెరిగినా.. దాని ప్రభావం దేశీయ ఇంధన విక్రయాలపై పడలేదు. ఇది సామాన్యులకు కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైన తొలి రోజుల్లో 140 డాలర్ల వరకు వెళ్లిన క్రూడాయిల్ బ్యారెల్ ప్రైస్..ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. 90 నుంచి 100 డాలర్ల మధ్యలో ఉంటూ వచ్చింది.

ఆ తరువాత కూడా ఇందులో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూ వచ్చాయి. 110 డాలర్లను దాటేసిన రోజులు కూడా ఉన్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ ఒక్కింటికి 110.47 డాలర్లకు చేరింది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఫలితంగా దీని ప్రభావం దేశీయ ఇంధన కొనుగోళ్లపై పడే ప్రభావం లేకపోలేదనే అంచనాలు వ్యక్తమైనా.. అలా జరగలేదు. క్రూడాయిల్ బ్యారెల్ ఒక్కింటికి 110 డాలర్లను దాటితే- ఆ భారాన్ని వినియోగదారులు తప్పనిసరిగా మోయాల్సి ఉంటుందని ఇదివరకే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సంకేతాలను ఇచ్చినప్పటికీ.. దాన్ని అమలు చేయకపోవడం ఊరటనిచ్చింది.

Fuel Prices on May 21: Check out here for petrol and diesel rates for todays price

సరిగ్గా సంవత్సరం కిందట 68 డాలర్ల వరకు ఉన్న క్రూడాయిల్ బ్యారెల్ ధర.. ఇప్పుడు 110 డాలర్లను దాటింది. క్రూడాయిల్ బ్యారెల్ ధర స్థిరంగా 110 డాలర్లకు పైగా కొనసాగడమంటూ జరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి వాటి రేట్ల జోలికి వెళ్లట్లేదు చమురు సంస్థలు. పాత ధరలను కొనసాగిస్తున్నాయి. ఇవ్వాళ కూడా అవే ధరలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదా కంపెనీలు.

ఇదివరకు 17 రోజుల వ్యవధిలో 14 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. గురువారం నాటి రేట్లే ఇవ్వాళ కూడా కొనసాగుతున్నాయి. దీని ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.105.41 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ120.51 పైసలు, డీజిల్ రూ.104.77 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.115.12 పైసలు, డీజిల్ రూ.99.83 పైసలుగా ఉంటోంది.

చెన్నైలో పెట్రోల్ రేటు రూ.110.85 పైసలు, డీజిల్ 100.94 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.111.09 పైసలు, డీజిల్ రూ.94.79 పైసలుగా ఉంటోంది. గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.105.86 పైసలు, డీజిల్ 97.10 పైసలు, తిరువనంతపురంలో పెట్రోల్ రూ.117.19 పైసలు, డీజిల్ 103.95 పైసలుగా నమోదైంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+