న్యూఢిల్లీ: ఇంధన ధరల్లో యధాతథ స్థితి కొనసాగుతోంది. పెరుగుదల గానీ తగ్గుదల గానీ చోటు చేసుకోలేదు. వాటి రేట్లు స్థిరంగా ఉంటోన్నాయి. కిందటి నెలలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత వాహనదారులకు కొంత ఊరట కలిగింది. పెట్రోల్‌పై 8, డీజిల్‌పై 6 రూపాయల మేర తగ్గించిన అనంతరం వాటి ధరలు శాంతించాయి. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.9.50 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 7 రూపాయల మేర తగ్గింది. అప్పటి నుంచి రేట్ల పెంపుదల చోటు చేసుకోలేదు.
దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ111.35 పైసలు, డీజిల్ రూ.97.28 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది.

లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.
పెట్రోల్, డీజిల్‌పై విధించిన వ్యాట్‌ను మరింత కుదించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసలుబాటు ఉందంటూ ఇటీవలే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంధనంపై వ్యాట్ అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు 49,229 కోట్ల రూపాయల రెవెన్యూ అందుతున్నట్లు అంచనా వేసింది. మహారాష్ట్ర, తెలంగాణతో పోల్చుకుంటే గుజరాత్‌లో వ్యాట్ తక్కువగా ఉందని వెల్లడించింది.
More From GoodReturns

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Petrol prices: పెట్రోల్, డీజిల్‌పై రూ. 10 పన్ను తగ్గింపు.. అయినా సామాన్యులకు ఊరట లేదు! ఏందుకంటే..

భారీగా పెరిగిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై టికెట్ ఛార్జీల మోత తప్పదిక..

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

Oil prices: ముదురుతున్న యుద్ధం! ఊహించని స్థాయిలో ఆయిల్ రేట్లు పెరగనున్నాయా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications