న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు గురువారం (డిసెంబర్ 3) పెరిగాయి. వరుసగా రెండో రోజు పెరిగాయి. మెట్రో సిటీల్లో లీటర్ పైన దాదాపు 20 పైసల చొప్పున పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ నోటిఫికేషన్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 17 పైసలు పెరిగి రూ.82.66, డీజిల్ ధరలు 19 పైసలు పెరిగి రూ.72.84కు చేరింది. గత 14 రోజుల్లో పెట్రోల్ ధరలు 11 రోజులు పెరిగాయి.

ఏ నగరంలో ఎంత ధర?
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.66, డీజిల్ ధర రూ.72.84, ముంబైలో పెట్రోల్ రూ.89.33, డీజిల్ 79.42, చెన్నైలో పెట్రోల్ రూ.85.59, డీజిల్ రూ.78.24, కోల్‌కతాలో పెట్రోల్ 84.18, డీజిల్ రూ.76.41గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ ధర రూ.90కి చేరువలో ఉంది.
నవంబర్ 30వ తేదీనే భోపాల్‌లో పెట్రోల్ ధర రూ.90 దాటింది. ఇండోర్, ఔరంగాబాద్ తదితర నగరాల్లోను ఈ మార్కు క్రాస్ చేసింది. పెట్రోల్ ధర రూ.90 దాటిన నగరాలు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) ఇక్కడ 39 శాతం ఎక్కువ అని, అందుకే రూ.90ని క్రాస్ చేసింది.

బ్యారెల్ ధర పెరిగితే...
గత రెండు వారాల్లో పెట్రోల్ ధర లీటర్ పైన రూ.1.45 పెరిగింది. డీజిల్ పైన రూ.2.15 పెరిగింది. బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 48 డాలర్లు దాటింది. నవంబర్ నెలలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 44 డాలర్లకు అటు ఇటు కదలాడింది. క్రూడాయిల్ ధర బ్యారెల్ పైన ఒక డాలర్ పెరిగిందంటే ఇక్కడ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పైన 40 పైసలు పెంచవలసి ఉంటాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో పోలిస్తే రూ.2 వరకు పెరగాలని అంటున్నారు.

వ్యాక్సీన్ సానుకూల ప్రకటనతో..
వ్యాక్సీన్ సానుకూల ప్రకటనల నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దాదాపు రెండు నెలల విరామం అనంతరం నవంబర్ 20వ తేదీ నుండి కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. నవంబర్ 22వ తేదీకి ముందు సెప్టెంబర్ 22వ తేదీన పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు మార్పులేదు. డీజిల్ ధర అక్టోబర్ 2వ తేదీన పెరిగింది. ఆ తర్వాత మార్పులేదు. అనంతరం నవంబర్ 20వ తేదీ నుండి పెరిగాయి. ఇక గత పద్నాలుగు రోజుల్లో పదకొండు సార్లు పెరిగాయి.
More From GoodReturns

పెట్రోల్, డీజిల్ పన్ను తగ్గింపు.. 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications