ఆ భారం కొంత తగ్గిందిగా: వారికి ఊరట: పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు చెక్ చేశారా?
ముంబై: క్రూడాయిల్ ధరలు దిగిరావట్లేదు. బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్లకు పైగా కొనసాగుతోంది. కొద్దిరోజులుగా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. 105 డాలర్ల వరకు ట్రేడింగ్ అవుతోంది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 103.19 డాలర్లు పలుకుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో కూడా పెరుగుదల చోటు చేసుకుంది. 97.60 డాలర్ల వద్ద ట్రేడింగ్ అయింది.

ఎల్పీజీపై భారం తగ్గింపు..
దీని ప్రభావం దేశీయ ఇంధన అమ్మకాలపై పడలేదు గానీ.. ఎల్పీజీ ధరలను మాత్రం కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా సవరించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్లపై 36 రూపాయలను తగ్గించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ల ధర 2,000 రూపాయల కంటే దిగువకు వచ్చింది. ఢిల్లీలో దాని ధర.. 2,012 నుంచి 1,976 రూపాయలకు తగ్గింది.

ఇంధన రేట్లిలా..
చమురు కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ఇవ్వాళ్టి కొత్త ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం రెండోసారి వ్యాట్‌ను తగ్గించిన తరువాత ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.

విశాఖలో..
కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది.

హైదరాబాద్‌లో..
అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి.

వ్యాట్ తగ్గింపుపై..
రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications