ముంబై: షేర్ మార్కెట్‌లో కొత్త పబ్లిక్ ఇష్యూ సందడి చేయబోతోన్నాయి. దీపావళి ట్రేడింగ్ ఆనవాయితీని కొనసాగిస్తూ- టాప్ కంపెనీలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయడానికి సమాయాత్తం కానున్నాయి. దీపావళి కంటే ముందే వాటికి సంబంధించిన ఐపీఓలు ఇష్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం రోజుల్లో దశలవారీగా అవన్నీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ వారం మొత్తం కొత్త ఐపీఓలతో మార్కెట్ కళకళలాడటం ఖాయం.

నాలుగు కంపెనీలు..
ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయడానికి సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) నాలుగు టాప్ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఐపీఓలను జారీ చేయడానికి ప్రాతిపదికగా చెప్పుకొనే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)పై సెబి తన ఆమోదాన్ని తెలిపింది. వాటిన్నింటిపైనా ఆమోదముద్ర వేసింది. సెబి ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ నాలుగు కంపెనీలు కూడా ఇక ఐపీఓలను జారీ చేయడం లాంఛనప్రాయమే అవుతుంది.

లిస్ట్‌లో ఉన్న కంపెనీలివే..
మొత్తం నాలుగు కంపెనీలకు చెందిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లను సెబి అనుమతి ఇచ్చింది. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానికి చెందిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా ఇందులో ఉంది. అదాని విల్మార్ ఐపీఓకు సెబి అనుమతి లభించింది. దీనితో పాటు- స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, పెన్నా సిమెంట్స్, నైకా కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూలను జారీ చేయడానికి సెబి అనుమతిని పొందాయి. దీపావళి కంటే ముందే ఈ నాలుగు కంపెనీలు కూడా ఐపీఓలను జారీ చేసే అవకాశం ఉంది.

బోణీ కొట్టిన నైకా
ఈ నాలుగు కంపెనీల్లో నైకా బోణీ కొట్టింది. కాస్మటిక్స్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ సెగ్మెంట్‌లో ఉన్న నైకా కంపెనీ తన ఐపీఓను జారీ చేసే తేదీని ప్రకటించింది. ఈ నెల 28వ తేదీన పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది. నైకా బ్రాండ్ నేమ్‌తో ఈ కంపెనీని లీడ్ చేస్తోన్న ఎఫ్ఎస్ఎన్ ఇ-కామర్స్ వెంచర్స్ ఈ పబ్లిక్ ఇష్యూను జారీ చేస్తుంది. నవంబర్ 1వ తేదీన పబ్లిక్ ఆఫరింగ్ ముగుస్తుంది. దీని ప్రైస్ బ్యాండ్‌ను నైకా యాజమాన్యం నిర్ధారించింది. ఒక్కో ఈక్విటీ షేర్ ప్రైస్ బ్యాండ్ 1,085 రూపాయల నుంచి 1,125 రూపాయల వరకు ఉంటుంది.

నవంబర్ 8న అలాట్‌మెంట్
నవంబర్ 8వ తేదీన నైకా షేర్ల అలాట్‌మెంట్‌ను ఫైనలైజ్ చేస్తుందీ కంపెనీ. అలాట్‌మెంట్ కాని వారికి ఆ మరుసటి రోజే రీఫండ్ చెల్లిస్తుంది. అలాట్‌మెంట్ లభించిన షేర్ హోల్డర్ల డీమ్యాట్ అకౌంట్లలో 10వ తేదీన స్టాక్స్ జమ అవుతాయి. 11వ తేదీ నుంచి ట్రేడింగ్ మొదలవుతుంది. ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ టీపీజీ సపోర్టింగ్‌గా ఉంటోన్న ఈ కంపెనీకి ఫల్గుణి నాయర్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోన్నారు. కాస్మటిక్స్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ సెగ్మెంట్‌లో ఉన్నందున భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 2012లో నైకాను నెలకొల్పారామె. ఆ తరువాత దీన్ని విస్తరించారు. నైకా ఫ్యాషన్, నైకా మ్యాన్ పేరుతో మరో రెండు కంపెనీలను ఏర్పాటు చేశారు.

డాట్ అండ్ కీ టేకోవర్
ఈ పరిణామాల మధ్య నైకా యాజమాన్యం.. స్కిన్ కేర్ బ్రాండ్ డాట్ అండ్ కీని టేకోవర్ చేసింది. దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది నైకా కొనుగోలు చేసిన మొట్టమొదటి డైరెక్ట్ టు కస్టమర్ బ్యూటీ బ్రాండ్ ఇదే. డాట్ అండ్ కీని టేకోవర్ చేయడానికి ఎంత మొత్తాన్ని ఖర్చు చేసిందనేది ఇంకా వెల్లడించలేదు. సుయాష్ ష్రాఫ్, అనీషా ష్రాఫ్ నెలకొల్పిన బ్యూటీ బ్రాండ్ డాట్ అండ్ కీ. ఎర్నెస్ట్ అండ్ యంగెస్ట్ ఎల్ఎల్‌పీ ఈ రెండు కంపెనీల మధ్య కుదిరిన డీల్‌కు ఎక్స్‌క్లూజివ్ అడ్వైజర్‌గా వ్యవహరించింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications