ఈ రోజుల్లో పొదుపు అనేది చాలా ముఖ్యం. కరోనా తర్వాత నుంచి దీనిపై పాఠం చాలామందికి అర్థమై ఉంటుంది. ఉద్యోగం చేసే సమయంలో కాని, వ్యాపారం చేసే సమయంలో కాని పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రావు. అలాగే ఇతరులను అప్పులు అడిగే భాద తప్పుతుంది. ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అంటే.. దేశంలో ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన ఓ యువకుడు తన దశాబ్ద కాలంలో ఉద్యోగం చేస్తూ రూ. 4 కోట్లు కూటడబెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి, ఏ వారసత్వం లేకుండా..ఎటువంటి లాటరీ లాంటి అదృష్టాలు దక్కకుండా, కేవలం శ్రమ, పట్టుదలతో తన జీవితాన్ని మార్చుకున్నాడు ఓ యువకుడు.34 ఏళ్ల వయసులో అతను తన వ్యక్తిగత పొదుపు ద్వారా రూ. 4 కోట్ల మార్క్‌ను చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. Reddit లోని r/noida సబ్‌రెడిట్‌లో ఓ యువకుడు Middle_Ad4237 అనే ఐడీలో తన పుట్టినరోజున ఆర్థిక ప్రయాణానికి సంబంధించిన వివరాలను షేర్ చేశాడు.

అతను పంచుకున్న వివరాల ప్రకారం.. ఈ రోజు నేను 34వ వడిలోకి అడుగుపెడుతున్నా... ఇప్పుడు నా వ్యక్తిగత పొదుపు రూ. 4 కోట్లను దాటి ఉంది. నాకు ఏ వారసత్వం లేదు. ఏ లాటరీ లేదు. కేవలం 10 సంవత్సరాల స్థిరమైన కృషి, సహనం, నియమిత జీవనంతో ఈ స్థాయికి చేరుకున్నా.. నా తండ్రి చెప్పిన మాటలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఈ విజయాన్ని సాధించానని చెప్పుకొచ్చాడు.
ఒక రోజు జీతం దొరకక, కూలి పనులకు వెళ్లిన తండ్రి కుమారుడిగా నేను గ్రామంలోని హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదురైనా.. నా తండ్రి నాకు ధైర్యం ఇచ్చేవారు. ఒకసారి నా తండ్రి చెప్పిన మాటలు నాకు జీవితాంతం స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన ఏమన్నారంటే.. నిన్ను చూసి ప్రజలు నన్ను గుర్తుపట్టే రోజు వస్తే, నాకు గర్వంగా ఉంటుందని.. ఆ మాటలు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ మాటలే నా విజయానికి సోపానాల మెట్లు అయ్యాయి అని రాసుకొచ్చాడు.
ఈ కుర్రాడు తన పోస్టులో కేవలం తాను అనుభవించిన ఆకలి గురించి మాత్రమే కాదు, గౌరవం కోసం కూడా తాను ఎలా పోరాటం సాగించాడో వివరించాడు.నాకు ఆకలి అంటే ఎలా ఉంటుందో ఎప్పటికీ గుర్తు ఉంటుంది. మీరు కడుపు నిండదు అనేది ఒక్కటే కాదు.. బ్రాండెడ్ Levi's టీ-షర్ట్ వేసుకుని సహజంగా కనిపించాలనే ఆకాంక్ష కూడా మీలో ఉండాలని అతను పోస్టులో రాసుకొచ్చాడు. తన జీవితాన్ని మార్చిన మలుపు .. కంప్యూటర్లు అని చెప్పుకొచ్చాడు.
From a Hindi-medium village boy to ₹4 Crore in savings at 34 – If I can, you can too.
byu/Middle_Ad4237 innoida
చిన్న ఉద్యోగం దొరికింది. పెద్ద ఉద్యోగం కాదు కానీ, స్థిరమైనది. అక్కడి నుంచే నా పొదుపు ప్రారంభం అయిందని రాసుకొచ్చాడు. ఆన్లైన్ ఫోరమ్‌లు, పుస్తకాల ద్వారా ఫైనాన్స్ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ పాఠాలతో ట్రేడింగ్ కూడా ప్రారంభించాడు.అతనికి గురువు లేరు. తప్పులే గురువులుగా భావించాడు జీవితంలో సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం అతని దగ్గర ఒక కారు, ఒక బైక్ ఉన్నాయి. అయితే ఇంకా
ఆ Techie కి సొంత ఇల్లు లేదు.దానిపై అతడుతొందర పడటం లేదు. ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కానీ నాకు గర్వంగా ఉంది. నా తండ్రి గర్వపడేలా జీవితం సృష్టించుకున్నాను అని అతడు చెప్పడం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
అతను పోస్ట్ ద్వారా ఏం చెబుతున్నాడంటే.. మీకు అద్భుతమైన ఇంగ్లీష్ అవసరం లేదు. ఎలైట్ డిగ్రీ అవసరం లేదు. కావాల్సింది ఆకలి, పట్టుదల, మీపై నమ్మకం ఉంటే విజయం అదే వస్తుంది. తాను ఇప్పటికీ జీవితాన్ని అర్థం చేసుకుంటున్నానని, అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమని చెబుతున్నారు. ఈ పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాలామంది సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
More From GoodReturns

LIC ఏజెంట్ నుంచి రూ. 40,000 కోట్ల సామ్రాజ్యం వరకు.. ఈయన ప్రయాణం అద్భుతం!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications