కోట్లు సంపాదించాలంటే పెద్ద కంపెనీ, భారీ పెట్టుబడి లేదా సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ నిజమైన సక్సెస్ మన చేతిలో ఉన్న అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడంలోనే ఉంటుంది. ఇదే విషయాన్ని నిరూపించింది ఒక అమ్మాయి. ఎంబీఏ చదివిన ఈమె, కార్పొరేట్ ఆఫీస్ ఉద్యోగానికి బదులుగా వ్యవసాయాన్ని ఎంచుకుంది. ఫలితంగా నేడు ఆమె పేరు ఒక్క పూణే జిల్లా, మహారాష్ట్రకి మాత్రమే కాక దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఆదర్శంగా నిలిచింది.

మహారాష్ట్రలోని పూణె జిల్లా కల్వడి గ్రామానికి చెందిన ప్రణిత వామన్ ఒకప్పుడు కార్పొరేట్ ఉద్యోగి. పూణెలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్‌లో MBA పూర్తి చేసింది. ఆ తర్వాత ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేసింది. కానీ అక్కడి కార్పొరేట్ వాతావరణం తనకు నచ్చలేదు. "]మనసుకు దగ్గరైన వ్యవసాయం వైపే వెళ్లాలి అని నిర్ణయించుకుంది.ఫ్యామిలీకి వ్యవసాయ భూమి ఉండటంతో, దాన్నే బేస్ చేసుకుని కొత్తగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. అందుకే మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి, తన సొంత పల్లెటూరులో ఉన్న పొలంలోనే క్యాప్సికం సాగు మొదలు పెట్టింది.
సాధారణ పంటలకంటే మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంట వేయాలి అని ఆలోచించింది. అలా ఆమె గ్రీన్ హౌస్ ఫార్మింగ్ టెక్నిక్‌ని ఎంచుకుంది. నేటి తరం రైతులు ఎక్కువగా పాటించే మోడ్రన్ అగ్రికల్చర్ పద్ధతులు నేర్చుకుని, వాటిని ప్రాక్టికల్‌గా అమలు చేసింది. ముఖ్యంగా క్యాప్సికం పంటపై దృష్టి పెట్టింది.
క్యాప్సికం దేశీయంగానే కాకుండా ఎగుమతుల్లో కూడా మంచి రేటు వస్తుంది. ఈ విషయం గుర్తించిన ఆమె, పెద్ద ఎత్తున గ్రీన్ హౌస్ లు నిర్మించి క్యాప్సికం సాగు ప్రారంభించింది. ఆధునిక నీటిపారుదల సిస్టమ్స్, పోషకాల సమతుల్యత, సేంద్రీయ సంరక్షణ అన్నింటినీ సైన్టిఫిక్‌గా ఫాలో కావడంతో పంట దిగుబడి కూడా అద్భుతంగా వచ్చింది.
4 కోట్ల టర్నోవర్
కొన్ని ఏళ్లలోనే ఆమె కృషి ఫలించింది. ప్రతి ఏడాదీ టన్నుల కొద్దీ క్యాప్సికం పంటను దేశంలో పెద్ద మార్కెట్లకు, ఎగుమతులకు సరఫరా చేస్తోంది. దాంతో వార్షిక టర్నోవర్ రూ. 4 కోట్లకు చేరింది. ఇది ఒక మహిళా రైతు సాధించిన అద్భుతంగా నిలిచింది.
ఇప్పుడామె ఫార్మ్‌ని చూడటానికి చాలా మంది యువ రైతులు వస్తున్నారు. ఎంబీఏ చదివిన ఈమె వ్యవసాయాన్ని ఎలా బిజినెస్ మోడల్‌గా మార్చిందో తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా యువతకి ఇది ఒక వేక్ అప్ కాల్. సక్సెస్ కోసం నగరాల్లోనే వెతకాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో ఉన్న అవకాశాలను మనం సరిగ్గా ఉపయోగిస్తే బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చు అని ఆమె నిరూపించింది.
ఉత్పత్తి విలువను పెంచడంలో ప్రణిత తీసుకుంటున్న నిర్ణయాలు ఆమె ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నాయి. కేవలం పంట పండించడం వరకు ఆగిపోకుండా, పంటను ఎలా మార్కెట్లోకి తీసుకెళ్లాలి, ఎలా ఆకర్షణీయంగా ప్యాక్ చేసి వినియోగదారుల ముందుకు చేర్చాలి అన్న విషయాల్లోనూ ఆమెకు మంచి అవగాహన ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా పంటకు అదనపు విలువను కల్పించడం, ఆధునిక ప్యాకేజింగ్ ద్వారా నాణ్యతను కాపాడుతూ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపును సంపాదించడం, అలాగే డిజిటల్ మార్కెటింగ్ సహాయంతో నేరుగా వినియోగదారులకూ చేరుకోవడం వంటి ఆలోచనలు ఆమెకు ఉన్నాయి. ఇలాంటి దూరదృష్టి, మార్కెట్ పరిజ్ఞానం వల్ల ఆమె భవిష్యత్తులో కేవలం రైతుగానే కాకుండా ఒక విజయవంతమైన అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్గా ఎదిగే అవకాశం చాలా ఎక్కువ.
యువతకు ప్రణిత చెప్పే సందేశం చాలా సులభం. ఆమెని చూస్తే, వ్యవసాయం కేవలం కష్టపడి పని చేయాల్సిన రంగం మాత్రమే కాదు అని తెలుస్తుంది. సరైన ప్రణాళిక, సైన్స్ జ్ఞానం, కొత్త పద్ధతులు, మేనేజ్‌మెంట్ కలిపి చేస్తే ఇది మంచి లాభాలు ఇచ్చే రంగమవుతుంది. కాబట్టి వ్యవసాయాన్ని పాత పద్ధతుల్లోనే కాకుండా కొత్త ఆలోచనలతో, టెక్నాలజీ సహాయంతో చేస్తే యువతకు ఇది మంచి భవిష్యత్తు ఇచ్చే మార్గంగా మారుతుంది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications