భారత ఐటీ రంగంలో కొనసాగుతున్న నియామకాల స్థబ్దత.. హైరింగ్-ఫ్రీజ్ పరిస్థితుల మధ్య, 18 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఒక భారతీయ టెక్నీషియన్ ప్రస్తుతం తీవ్రమైన ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. నిఫ్టీ50 కంపెనీలో మిడ్-లెవల్ మేనేజర్‌గా పనిచేస్తూ సంవత్సరానికి దాదాపు రూ. 70 లక్షల వేతనం పొందుతున్న ఈ టెకీ.. పునర్నిర్మాణ చర్యల కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత గత 7 నెలలుగా అవకాశాలు దొరకక తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ఈ టెకీ తన బాధను Reddit లో పంచుకున్నాడు. గత 7 నెలలుగా ఉద్యోగం కోసం Techie వెతుకుతూనే ఉన్నాను కానీ ఒక్క అవకాశమూ దొరకడం లేదు. నా పొదుపులు దాదాపు పూర్తిగా ఖర్చయ్యాయి, కేవలం 2 నెలల రన్‌వే మాత్రమే మిగిలింది. 18 సంవత్సరాల అనుభవంలో పలు పరిశ్రమలలో నూతన సాంకేతికత అమలు చేయడం, బోర్డ్‌రూమ్ స్థాయి డిజిటల్ పరివర్తన ప్రాజెక్టులు నడపడం వంటి బాధ్యతలు నిర్వహించినా, ఉద్యోగ మార్కెట్‌లో దరఖాస్తులకు స్పందన తక్కువగానే ఉందని తెలిపాడు.

అతను తాజాగా పెద్ద ఇల్లు కొనుగోలు చేసిన విషయం వెల్లడిస్తూ..ఉద్యోగం కోల్పోవడంతో EMI చెల్లించలేక ఇల్లు అద్దెకు ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు.నా కుటుంబ సభ్యులందరూ ఒత్తిడిలో ఉన్నారు. బాధ పెరుగుతోందని రెడ్డిట్ లో పేర్కొన్నాడు. LinkedIn, Naukri, రిఫరల్స్, కన్సల్టెంట్లు.. దాదాపు అన్ని మార్గాల్లో ప్రయత్నించినప్పటికీ ఫలితాలు రాలేదని వాపోయాడు.గత 7 నెలల్లో నాకు రెండు ఇంటర్వ్యూలు మాత్రమే వచ్చాయి. తక్కువ జీతంతో పనిచేయడానికి కూడా సిద్ధమే. కానీ కంపెనీల నుంచి కాల్స్ రావడం లేదని బాధతో రాశాడు.
అతని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక మంది వినియోగదారులు తమ సానుభూతిని ప్రకటించారు. కొందరు తమకూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని చెప్పగా, మరికొందరు ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ వాస్తవాలను సూచిస్తూ నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు. నాకు కూడా 11 సంవత్సరాల అనుభవం ఉంది. రిఫరల్స్ పనిచేయడం లేదు. కాల్స్ రావడం లేదు. మీ పరిస్థితి నాకు బాగా అర్థమవుతోందని ఓ నెటిజన్ అన్నారు.
కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. ప్రాజెక్ట్ మేనేజర్ రోల్స్ ఆటోమేటెడ్ అవుతున్నాయి. మార్కెట్ డిమాండ్‌కు సరిపోయే స్కిల్స్ నేర్చుకోవడం తప్పనిసరి అని మరొక నెటిజన్ సూచించారు. ఇంకొకరు ఉన్నత అనుభవం కలిగినవారికి సంభవించే ఓవర్-క్వాలిఫికేషన్ సమస్యపై దృష్టి పెట్టారు. మీరు అప్లై చేసే రోల్స్‌కు మీ అనుభవం ఎక్కువైందని భావించి కొన్నిసార్లు తిప్పేస్తారు. రెజ్యూమేను రోల్‌కు సరిపోయేలా మార్చండని సలహా ఇచ్చారు.
కొంతమంది ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి తాత్కాలిక చర్యలను కూడా సూచించారు. అవసరం అయితే పూర్వీకుల ఆస్తి లేదా బంగారు ఆభరణాలు రీడీమ్ చేసుకోవడం ఆలోచించండి. ఓపిక పెంచుకోండి. మార్పు ఖచ్చితంగా వస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ సంఘటన ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు.. 2024-25లో భారత ఐటీ రంగంలో అనుభవజ్ఞులైన ఉద్యోగులపై పెరుగుతున్న ఒత్తిడి, automation ప్రభావం, విదేశీ కస్టమర్ల వ్యయ నియంత్రణ, hiring freeze వంటి సమస్యల ప్రతిబింబం కూడా ఇది.అనుభవం ఎక్కువగా ఉన్న టెకీలకు అవకాశాలు తగ్గిపోవడం, మధ్యస్థాయి మేనేజ్మెంట్ రోల్స్ ఆటోమేటెడ్ అవడం, కంపెనీలు lean structures వైపు కదలడం వంటి అంశాలు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications