ఇప్పుడు పెరుగుతున్న జీతం మనం కోరుకునే ఆనందానికి నిదర్శనం కావాలి. కానీ ఎక్కువ జీతం = ఎక్కువ పన్ను అన్న వాస్తవం ఇప్పుడు ఎంతో మంది ప్రొఫెషనల్స్‌ను ఆలోచనలోకి నెట్టుతోంది. తాజాగా ఒక రెడ్డిట్ యూజర్ చేసిన పోస్ట్ ని స్పష్టంగా చూపించింది. ముందుగా రూ. 48 లక్షల వేతనం ఉన్న వ్యక్తికి రూ. 75 లక్షల ఆఫర్ వచ్చింది. కానీ అతడు ఆనందపడలేదు ఎందుకంటే టేక్ హోం వృద్ధికి మించిన స్థాయిలో ట్యాక్స్ భారం పెరిగిపోతోంది. ఈ వాస్తవానికి సంబంధించిన చర్చ రెడ్డిట్ లో నెట్టింట్లో వైరల్ అయింది.

ఆ యూజర్ చెప్పిన విషయమంటే ప్రస్తుతం తాను సంవత్సరం మొత్తానికి రూ. 48 లక్షల వేతనం పొందుతున్నానని చెప్పారు. ఇప్పుడు తనకు రూ. 75 లక్షల జీతంతో కొత్త ఉద్యోగ ఆఫర్ వచ్చింది. ఇది చాలా మంచి ఆఫర్ అయినా కూడా, తాను ఈ అవకాశాన్ని తీసుకోవాలా వద్దా అనే విషయంలో కలవరం చెందుతున్నానని వెల్లడించారు. ఇది చూస్తే సుమారు 56% జంప్. కానీ ఆనందపడాల్సిన పరిస్థితిలో, అతను పన్నుల భారం పెరగడం గురించి ఆలోచిస్తూ పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం నేను సుమారు రూ. 12 లక్షలు పన్ను చెల్లిస్తున్నాను. కొత్త ఆఫర్ తీసుకుంటే అది దాదాపు రూ. 22 లక్షలకు పెరిగిపోతుంది. ముఖ్యంగా రూ. 50 లక్షల పైగా ఆదాయంపై అదనంగా వచ్చే 10% సర్చార్జ్ వల్లే ఇది జరుగుతుంది," అని అతను పేర్కొన్నాడు.
ఇంకా, కొత్త జీతంలో అనుకూలమైన అలవెన్స్‌లు, మినహాయింపులు ఉండకపోవడం వల్ల టాక్స్ ఆదా చేసే మార్గాలు కూడా లేవని అన్నాడు. నిజానికి నా టేక్ హోం జీతం సుమారు 50% పెరుగుతుంది. కానీ పన్ను బరువు మాత్రం దాదాపు రెట్టింపు అవుతోంది. ఈ పరిస్థితిలో నేను ఎంతో కష్టపడితే ఆ మొత్తాన్ని మళ్లీ పన్నుగా పోగొట్టడం న్యాయమా? అని అతను తన సందేహం చెప్పాడు.
ఈ పోస్ట్‌పై Redditలో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు ఆ వ్యక్తి ఆలోచనను సమర్థించగా, మరికొందరు అతని బాధను ఉత్కంఠగా విమర్శించారు. ఒక యూజర్ ఇలా అన్నాడు "ఇది ఒక సారి మాత్రమే ఎదురయ్యే దశ. రూ. 75 లక్షల జీతంతో నువ్వు ఎక్కువగా ఆదాయం సంపాదించగలవు. తర్వాత 10% హైక్ వచ్చినా, అది రూ. 48 లక్షలతో పోల్చితే చాలా ఎక్కువ అవుతుంది. ఇది కాంపౌండ్ అవుతూ నీ ఆదాయం వేగంగా పెరుగుతుంది.
నీవు ఉద్యోగిగా కాకుండా కన్సల్టెంట్‌గా చర్చలు జరిపితే, పన్ను ఆదా చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకరు అంతర్జాతీయ దృష్టితో ఇలా వివరించారు "ప్రతి దేశంలోనూ ఎక్కువ ఆదాయంపై మార్జినల్ టాక్స్ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. నీ జీతం రూ 27 లక్షలు పెరగుతుంది. నెట్ జీతం రూ 15 లక్షలు పెరుగుతుంది. ఇది మంచి డీల్. తీసుకోలేదంటే జీవితాంతం రూ 50 లక్షల క్రిందే ఉండిపోతావు అన్న ఆలోచన వెంటాడుతుంది.
ఈ కథనం ద్వారా మనకు ఒక్క విషయం బాగా అర్థమవుతోంది. భారత్‌లో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగులకు పన్నుల భారం ఎక్కువగా ఉంటోంది. జీతం పెరగడం కేవలం ఆనందానికి కాదు, కొన్నిసార్లు ఆందోళనకు కూడా కారణమవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు తెలివైన ఆర్థిక ప్రణాళిక తయారుచేసుకోవాలి. స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేయడం, పన్నుకి ఉపయోగపడే అలవెన్స్‌లు ఉన్న జాబ్ స్ట్రక్చర్‌లు ఎంచుకోవడం చాలా అవసరం. అప్పుడే జీతం పెరిగిన తర్వాత వచ్చే పన్నుల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
NSC (National Savings Certificate), లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, EPF వంటి పెట్టుబడులు వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా, 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై మినహాయింపు లభిస్తుంది ఇది వ్యక్తికి మరియు కుటుంబానికి కలిసి రూ 25,000 నుంచి రూ1 లక్ష వరకు ఉండొచ్చు (వృద్ధుల ఆధారితులైతే మినహాయింపు ఎక్కువగా ఉంటుంది).
ఇంకా, NPS (National Pension System) కింద అదనంగా రూ 50,000 వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇది 80CCD(1B) కింద లభిస్తుంది. అలాగే, HRA (House Rent Allowance) కూడా గృహ భాద్యతలు ఉన్నవారికి పన్ను మినహాయింపు కలిగించగలదు. అయితే HRA మినహాయింపు పొందేందుకు కొంత నిర్దిష్ట ప్రమాణాలు ఉంటాయి ఉదాహరణకు అద్దెను చెల్లించాలి, PAN వివరాలు ఇవ్వాలి మొదలైనవి.
ఈ అన్ని అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలంటే, అనుభవం ఉన్న ఫైనాన్షియల్ ప్లానర్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) సలహా తీసుకోవడం మంచిది. వారు మీ ఆదాయాన్ని, ఖర్చులను, పెట్టుబడులను సమగ్రంగా విశ్లేషించి మీకు సరిపోయే పన్ను ప్రణాళికను రూపొందించడంలో సహాయం చేస్తారు. దీని ద్వారా పన్ను భారం తగ్గించడంతో పాటు, భవిష్యత్తు కోసం మంచి సంపదను కూడా నిర్మించుకోవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications