కర్ణాటక రాష్ట్రంలో అవినీతి తిమింగళం ఏసీబీ అధికారులకు చిక్కింది. ఈ ప్రభుత్వ మాజీ ఉద్యోగి అక్రమంగా సంపాదించిన ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే బిత్తరపోయారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL) సంస్థలో 20 సంవత్సరాలకు పైగా పనిచేసిన కలకప్ప నిడగుండి అనే అవుట్‌సోర్స్డ్ క్లర్క్ అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. నెలకు కేవలం రూ.15,000 జీతం తీసుకుంటూ అతను ఏకంగా రూ. 30 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
గురువారం ఉదయం 6 గంటల నుంచి.. కొప్పల్‌లోని నిడగుండి నివాసంపై లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ దాడుల్లో బయటపడిన ఆయన ఆస్తులు చూసి అందరూ నోరెళ్లబెట్టారు. మొత్తం 24 ఇళ్లు, 6 ప్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి, 1 కిలోకు పైగా బంగారం, ఇంకా వాహనాలు ఏసీబీ దాడుల్లో బయటకు వచ్చాయి. మరికొన్ని ఆస్తులు ఆయన భార్య, సోదరుల పేర్ల మీద నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఈ దాడులు KRIDLలో రూ.72 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులపై జరిగినవని అధికారులు చెబుతున్నారు. మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జరనప్ప చించోలికర్, నిడగుండిపై ఇద్దరు KRIDL ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు అనిల్ పాటిల్, ఆనంద్ కర్లకుంటి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అతనిపై దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019 నుంచి 2025 మధ్య కాలంలో మురుగు నీటి పారుదల, రోడ్లు, తాగునీటి పనులకు సంబంధించి 96 ప్రాజెక్టులపై నకిలీ పత్రాలు, ఇన్‌వాయిసులు సృష్టించారు.
ఈ స్కాంలో కనకగిరి, గంగావతి, యెల్బుర్గ, కొప్పల్ తాలూకాల్లో పెద్ద మొత్తంలో మంజూరైన గ్రాంట్లు వేరే దారికి మళ్లించారు. దాడులకు ముందు నిడగుండిని ఉద్యోగం నుంచి తొలగించగా.. చించోలికర్ కోర్టు ఉత్తర్వుల కారణంగా ఇంకా సర్వీసులో కొనసాగుతున్నారు.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రాన్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. రూ. 15 వేల జీతగాడు ఈ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టడం ఏంటని విస్తుపోతున్నారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికార పార్టీపై ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు రెడీ అయింది. కొప్పల్ ఎమ్మెల్యే కె. రాఘవేంద్ర హిట్నాల్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో నిడగుండితో పాటు సిమెంట్ సరఫరాదారు అమరేష్ యంబలదిన్నిల ప్రమేయం ఉందని తెలిపారు.
ప్రభుత్వం ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపడుతుందని తెలిపారు. నేరం రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రభుత్వ విభాగాల్లో జరిగే అవినీతిని మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. కేవలం జీతం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు అంచనాలు వేసే కాలం పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications