భారతదేశం విడిచి వెళ్ళే ధనవంతుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. వీరంతా ఇండియాలో డబ్బులు సంపాదించుకుని విదేశాల్లో స్థిరపడుతున్నారు. 2024 ఏడాదిలోనే దాదాపు 2.06 లక్షలకు పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. దేశం విడిచి వెళ్ళే వారిలో ఎక్కువ మంది HNW అంటే అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ షాకింగ్ విషయాలను హెన్లీ & పార్టనర్స్ నివేదిక వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం.. 2025 సంవత్సరంలో దాదాపు 3,500 మంది మిలియనీర్లు భారతదేశం విడిచివెళ్లడానికి రెడీగా ఉన్నారు. వారి మొత్తం సంపద 26.2 బిలియన్ల డాలర్లు. 2023లో కూడా 4,300 మంది మిలియనీర్లు దేశం విడిచి వెళ్ళారు. 2011 నుండి, 17.5 లక్షల మంది భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లను వదులుకున్నారని ఈ నివేదిక తెలిపింది. 2011 నుండి ఇప్పటివరకు మొత్తం 17 లక్షల 50 వేల మంది భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లను వదిలిపెట్టారని నివేదిక చెబుతోంది.

అయితే చాలా మంది millionaires భారతదేశాన్ని ఎందుకు వదిలి వెళ్తున్నారు? భారతదేశంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి. మెరుగైన జీవితం, మంచి ఆరోగ్య సేవలు, పని, వ్యాపార అవకాశాలు, తక్కువ పన్నులు, భద్రత వంటి కారణాల వల్ల ధనవంతులు ఇతర దేశాలకు తరలిపోతున్నారని హెన్లీ & పార్టనర్స్ చెబుతున్నారు. విదేశాలలో స్థిరపడటానికి ప్రధాన కారణాలను కూడా వారు వివరిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా ఇక్కడ పన్నులు చెల్లించిన ప్రతిఫలం సాధారణ ప్రజలకే కాకుండా సంపన్నులకు కూడా అందడం లేదని తెలుస్తోంది.
ఐర్లాండ్‌కు వలస వెళ్లిన దేవిక (పేరు మార్చబడింది) మాట్లాడుతూ..మేము సంవత్సరానికి రూ.50 లక్షలకుపైగా ఆదాయపు పన్ను చెల్లించాం. కానీ దానికి ప్రతిగా భద్రత, ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లభించలేదు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు చాలా వెనుకబడ్డాయని చెప్పుకొచ్చారు.
భారత పాస్‌పోర్ట్ హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 76వ స్థానంలో ఉంది. దీని ద్వారా కేవలం 58 దేశాలకు మాత్రమే వీసా రహిత యాక్సెస్ ఉంటుంది. దానికి విరుద్ధంగా US (193 దేశాలు), సింగపూర్ (192), కెనడా (186) పాస్‌పోర్ట్‌లు మరింత బలమైన మొబిలిటీని ఇస్తాయి. ఈ కారణంగా చాలామంది సంపన్నులు పాస్‌పోర్ట్ మార్పునే పెద్ద ప్రాధాన్యంగా చూస్తున్నారని నివేదిక తెలిపింది.
2018 నుండి 2023 మధ్య 3.2 లక్షల భారతీయులు అమెరికాలో, 1.6 లక్షలు కెనడాలో, 1.3 లక్షలు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. అలాగే దుబాయ్, సింగపూర్, పోర్చుగల్, మాల్టా వంటి దేశాలు తక్కువ పన్నులు, నివాసం ఉండేందుకు సులభమైన హక్కులు, పెట్టుబడి ద్వారా పౌరసత్వం వంటి అవకాశాలను అందిస్తున్నాయి. దీంతో భారతీయ ధనవంతులంతా విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇక విదేశీ విశ్వవిద్యాలయాలు, పరిశోధనావకాశాలు, స్థిరమైన ఆర్థిక వాతావరణం ఈ వలసలకు ప్రధాన ఆకర్షణలుగా మారాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తు కల్పించాలన్న ఉద్దేశంతో విదేశీ పౌరసత్వాన్ని ఎంచుకుంటున్నారని ఈ నివేదిక తేల్చి చెప్పింది.
UAEలో వ్యక్తిగత ఆదాయపు పన్ను 0%, కార్పొరేట్ పన్ను 9% మాత్రమే. కానీ భారతదేశంలో వ్యక్తిగత ఆదాయ పన్నులు అధికంగా ఉండగా, కార్పొరేట్ పన్నులు తక్కువగా ఉంటాయి. విజ్డమ్ హాచ్ వ్యవస్థాపకుడు అక్షత్ శ్రీవాస్తవ దీనిపై మాట్లాడుతూ..భారతదేశంలో అధిక పన్నులు చెల్లించాలి, కానీ ఆరోగ్యం, విద్య, భద్రత వంటి వాటికి అదనంగా ప్రైవేట్‌గా ఖర్చు చేయాలి. ఇది మధ్యతరగతిని, అలాగే సంపన్నులను కూడా దేశం విడిచి వెళ్లేలా చేస్తోందన్నారు.
ఏదేమైనా మిలయనీర్లు ఇండియా నుంచి వలసవెళ్లడం.. దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మిలియనీర్లు కేవలం వ్యక్తులు కాదు, వారు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చే శక్తి కేంద్రాలని చెబుతున్నారు. వారిని నిలుపుకోలేకపోతే, భారత్ భవిష్యత్తు అవకాశాలను కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications