India-US Trade Deal : భారత్-అమెరికా మధ్య జరిగిన బమధ్యంతర వాణిజ్య ఒప్పందం చుట్టూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండు దేశాలు పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఒక వాణిజ్య ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిన వెంటనే.. అమెరికా ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిన ఒక ఫ్యాక్ట్ షీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా భారత్‌పై చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలను వైట్ హౌస్ నిశ్శబ్దంగా సవరించడం రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఈ ఫ్యాక్ట్ షీట్ విడుదలైన ఒక రోజు తర్వాతే.. భారతదేశంపై సుంకాల కోతలకు సంబంధించి వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో ఉన్న 'కొన్ని పప్పుధాన్యాలు' అనే పదాలను వైట్ హౌస్ తన పాఠ్యం నుంచి తొలగించింది. ఇది మాత్రమే కాకుండా అమెరికా ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేసే విషయంలో ఉపయోగించిన భాషను కూడా గణనీయంగా మార్చింది. తొలుత భారతదేశం కట్టుబడి ఉంది (commits) అని పేర్కొనగా.. తాజా సవరణలో అదే వాక్యం భారతదేశం ఉద్దేశించింది (intends)గా మారింది.

సోమవారం విడుదల చేసిన అసలు ఫ్యాక్ట్ షీట్‌లో.. భారత్ అమెరికన్ పారిశ్రామిక వస్తువులు, విస్తృత శ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగించడానికి లేదా తగ్గించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అందులో ఎండిన డిస్టిలర్స్ గ్రెయిన్స్ (DDGs), ఎర్ర జొన్నలు, చెట్టు గింజలు, తాజా, ప్రాసెస్ చేసిన పండ్లు, కొన్ని పప్పుధాన్యాలు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి.
అయితే ఫిబ్రవరి 6న భారత్-అమెరికా కలిసి విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పప్పుధాన్యాలపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో, వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్‌లో కొన్ని పప్పుధాన్యాలు అనే అంశం చేరడం భారతీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై వచ్చిన స్పందనల అనంతరం.. వైట్ హౌస్ తన ఫ్యాక్ట్ షీట్‌ను సవరించి, ఆ పదాలను పూర్తిగా తొలగించింది. సవరించిన పత్రంలో భారత్ సుంకాలు తగ్గించబోయే ఉత్పత్తుల జాబితాలో ఇప్పుడు DDGs, ఎర్ర జొన్నలు, చెట్టు గింజలు, తాజా మరియు ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్ మాత్రమే ఉన్నాయి. పప్పుధాన్యాల ప్రస్తావన ఇక ఎక్కడా కనిపించదు.
ఇదే సమయంలో మరో కీలక మార్పు కూడా చోటుచేసుకుంది. ఫిబ్రవరి 9న విడుదలైన అసలు ఫ్యాక్ట్ షీట్‌లో.. భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉంది అని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే తాజా వెర్షన్‌లో ఈ పదజాలాన్ని మృదువుగా మార్చి, భారత్ 500 బిలియన్ డాలర్లకు పైగా అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భావిస్తోంది అని పేర్కొన్నారు.
తాజా పాఠ్యం ప్రకారం.. భారత్ మరిన్ని అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే ఉద్దేశం వ్యక్తం చేసింది. ఇందులో ప్రధానంగా అమెరికా ఇంధనం, ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉత్పత్తులు, బొగ్గు మరియు ఇతర వస్తువులు ఉన్నాయి. అయితే, ఇవన్నీ ఖచ్చితమైన హామీలుగా కాకుండా.. ఒక ఉద్దేశ ప్రకటనగా మాత్రమే చూపించడమే ఈ సవరణలోని అసలు మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏదేమైనా వైట్ హౌస్ చేసిన ఈ నిశ్శబ్ద సవరణలు భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లోని సున్నితత్వాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. పదాల మార్పు చిన్నదిగా కనిపించినా, అంతర్జాతీయ వాణిజ్యంలో ఇవి పెద్ద సంకేతాలుగా పరిగణించబడుతున్నాయి. ఈ మధ్యంతర ఒప్పందం భవిష్యత్తులో పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందంగా మారుతుందా? లేక ఇంకా చర్చల దశలోనే కొనసాగుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా నిలుస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications