భారతదేశంలోని ప్రముఖ క్రాఫ్ట్ బీరు తయారీ సంస్థ బీరా 91 (Bira 91) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు దేశ బీరు మార్కెట్లో ట్రెండ్‌సెటర్‌గా నిలిచిన ఈ కంపెనీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితికి చేరింది. అనేక మంది ఉద్యోగులు కంపెనీ గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. బీరా 91 మాతృ సంస్థ B9 బెవరేజెస్ లిమిటెడ్ లోని 250 మందికి పైగా ప్రస్తుత, మాజీ ఉద్యోగులు.. ప్రభుత్వ అధికారులు, పెట్టుబడిదారులకు లేఖ రాశారు.
అందులో నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం, పన్ను మినహాయింపులు చేసినా జమ చేయకపోవడం, పీఎఫ్, గ్రాట్యుటీ చెల్లింపులు జరగకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. దీంతో సంస్థ వ్యవస్థాపకుడు CEO అంకుర్ జైన్ రాజీనామా చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వారు ఈ సంక్షోభాన్ని కేవలం డబ్బు సమస్యగా కాకుండా, నమ్మక సంక్షోభంగా వర్ణిస్తున్నారు.

సంస్థ పరిస్థితిని మరింత క్లిష్టం చేసిన విషయం ఏంటంటే.. బీరా 91 యాజమాన్యంలోని ది బీర్ కేఫ్ అనే ప్రముఖ పబ్ చైన్‌ను పెట్టుబడిదారులు స్వాధీనం చేసుకోవడం. దీనికి ప్రధాన కారణం బీరా 91 ఆ వ్యాపారంపై తీసుకున్న రుణాన్ని చెల్లించలేకపోవడం. ప్రస్తుతం ఈ వ్యవహారం ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతోంది, కోర్టు తాత్కాలికంగా తాకట్టు పెట్టిన షేర్ల బదిలీని నిలిపివేసింది. అయినప్పటికీ కంపెనీపై నియంత్రణ సడలిపోతోందని స్పష్టంగా కనిపిస్తోంది.
B9 బెవరేజెస్ తన పేరును 2023 చివరలో ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లిమిటెడ్‌గా మార్చుకుంది. ఇది పబ్లిక్ కంపెనీగా మారడానికై అవసరమైన ప్రక్రియలో భాగమే అయినా, మద్యం రంగంలో కంపెనీ పేరు మారినప్పుడు మద్యం లైసెన్సులు తిరిగి దరఖాస్తు చేయాల్సి వస్తుంది. ఈ అనుమతులు నెలల తరబడి లభించకపోవడంతో కంపెనీ ఉత్పత్తి చేసిన బీరు అమ్మలేని పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమ వర్గాల ప్రకారం, దాదాపు రూ. 80 కోట్ల విలువైన బీరు స్టాక్ గిడ్డంగులలో నిలిచిపోయింది. దీని వల్ల నగదు ప్రవాహం (cash flow) పూర్తిగా క్షీణించింది, అప్పులు పెరిగాయి, వ్యాపారం కుదేలయింది.
2024 ఆర్థిక సంవత్సరంలో బీరా 91 ఆదాయం సుమారు రూ. 638 కోట్లకు పడిపోయింది. కాగా నష్టాలు రూ.750 కోట్లకు చేరాయి. మొత్తం నష్టాలు రూ. 1,900 కోట్లకు పైగా ఉన్నాయని అంచనా. కంపెనీ రూ. 500 కోట్లు సేకరించాలన్న ప్రణాళిక విఫలమైంది. గత మూడు సంవత్సరాలలో కంపెనీ అన్‌లిస్టెడ్ షేర్ల విలువ 70 శాతం కంటే ఎక్కువ తగ్గిపోయింది.
ఒకప్పుడు దాదాపు 700 మంది ఉద్యోగులు ఉన్న ఈ కంపెనీలో ఇప్పుడు సంఖ్య 260 మందికి పడిపోయింది. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో అనేక మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా లేదా బలవంతంగా ఉద్యోగాలను వదిలేశారు. ఉద్యోగుల బకాయిలు సుమారు రూ. 50 కోట్లకు చేరుకున్నాయని సమాచారం.
క్లుప్తంగా చెప్పాలంటే బీరా 91 కథ ఒక స్టార్ట్‌అప్ విజయగాథ నుంచి ఆర్థిక మత్తు దిశగా మారిన చేదు ఉదాహరణగా మారుతోంది. నిధుల కొరత, పరిపాలనా లోపాలు, లైసెన్స్ జాప్యం, పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోవడం వంటి కారణాలు కలసి భారత క్రాఫ్ట్ బీరు దిగ్గజాన్ని మత్తులోకి నెట్టేశాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications