IT Jobs: ఫ్రెషర్లకు ఫ్రెంచ్ ఐటీ కంపెనీ శుభవార్త.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్.. పూర్తి వివరాలు..

IT Jobs: ఐటీ ఉద్యోగాల వేటలో తలమునకలైన యువతకు ఇదొక గుడ్ న్యూస్. ఎందుకంటే చాలా కంపెనీలు ఇప్పటికే నియామకాలను నిలిపివేశాయి. మరికొన్ని నియమించుకున్న వారిని సైతం రిజెక్ట్ చేస్తున్నాయి. కానీ ఈ ఫ్రెంచ్ టెక్ కంపెనీ మాత్రం తమకు ఉద్యోగులు కావాలని అంటోంది. పైగా వారికి ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటును కూడా ఇస్తామని తెలిపింది.

ఉద్యోగం వివరాలు..

ఉద్యోగం వివరాలు..

భారత దేశంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఐటీ దిగ్గజం Capgemini వివిధ విభాగాల్లో కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తోంది. కేవలం ఐటీ రంగంలో మాత్రమే కాకుండా.. ఫైనాన్షియల్ సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్, స్ట్రాటజీ & ట్రాన్స్‌ఫర్మేషన్, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్, ఎనర్జీ, ఇంజినీరింగ్, కన్స్యూమర్ గూడ్స్, రిటైల్ వంటి అనేక రంగాల్లో ఉద్యోగులను నియమించుకోవటానికి కంపెనీ రిక్రూట్ మెంట్ ప్రారంభించింది. ఇందులో టెలికాం రంగానికి చెందిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి.

ఎక్కడ ఉద్యోగం..

ఎక్కడ ఉద్యోగం..

కంపెనీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, నోయిడా, ముంబై, కోల్‌కతాలోని క్యాప్‌జెమినీ కార్యాలయాల్లో ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం వివిధ అర్హతలను కలిగి ఉండాలని వెల్లడించింది. పైగా ఇవి శాశ్వత ఉద్యోగాలు కావటం గమనార్హం. ఇందుకోసం కంపెనీ ఏడాది నుంచి 15 సంవత్సరాలు అనుభవం ఉన్న అభ్యర్థులను నియమించుకుంటోంది. దీనికి తోడు ఫ్రెషర్లను సైతం రిక్రూట్ చేసుకుంటోంది.

దరఖాస్తు ఎలా..

దరఖాస్తు ఎలా..

కంపెనీ నియామకాల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవటానికి అధికారిక వెబ్ సైట్ www.capgemini.comని సందర్శించవచ్చు. లేదా కంపెనీకి చెందిన లింక్డ్‌ఇన్ పేజీని తనిఖీ చేయవచ్చు. వెబ్‌సైట్ లో వివిధ ఉద్యోగ అవకాశాలు, అందుకు అవసరైన అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా వారికి ఉద్యోగం అవసరమైన నగరం లేదా ప్రాంతాన్ని ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ఉద్యోగాల వివరాలు..

ఉద్యోగాల వివరాలు..

ప్రస్తుతం కంపెనీ 3.4 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. క్యాప్‌జెమినీ ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ దేశాల్లో తన వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలోని 200 అతిపెద్ద పబ్లిక్ కంపెనీల్లో 85 శాతం కంపెనీలు తనకు క్లయింట్స్ గా ఉన్నట్లు capgemini వెల్లడించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+