Foxconn: భారత్‍లో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోలేదన్న ఫాక్స్కాన్ ..!
తైవానీస్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ దిగ్గజం ఫాక్స్కాన్ తన ఛైర్మన్ ఇటీవలి పర్యటనలో ఇండియా పెట్టుబడుల కోసం ఎటువంటి బైండింగ్, ఖచ్చితమైన ఒప్పందాలు చేసుకోలేదని అని వార్తా సంస్థ AFP నివేదించింది. "ఈ పర్యటనలో ఫాక్స్కాన్ కొత్త పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోలేదు" అని తెలిపింది. ఐఫోన్ విడి భాగాలను తయారు చేయడానికి కర్ణాటకలోని ఒక కొత్త ప్లాంటుపై ఫాక్స్కాన్ 700 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 4 వరకు ఫాక్స్కాన్ ఛైర్మన్ యంగ్ లియు భారత్ లో పర్యటించారు.

బసవరాజ్ ఎస్. బొమ్మై
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్. బొమ్మై శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. యాపిల్ రాష్ట్రంలోని ఒక కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనుందని తెలిపారు."సుమారు 100,000 ఉద్యోగాలు" వస్తాయని చెప్పారు. తెలంగాణలో కూడా "ఎలక్ట్రానిక్స్ తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి" లియు గురువారం ఒక ఒప్పందంపై సంతకం చేసినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

సెమీకండక్టర్
అయితే భారత్‍లో ఫాక్స్కాన్ ఎలాంటి పెట్టుబడులకు ఒప్పదం చేసుకోలేదని వార్తలు రావడం గమనార్హం "ఈ వారం నా పర్యటన భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి ఫాక్స్కాన్ చేసిన ప్రయత్నాలకు మద్దతు ఇచ్చింది. సెమీకండక్టర్ అభివృద్ధి, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి కొత్త రంగాలలో సహకారాన్ని కోరుకుంది" అని లియు ఒక ప్రకటనలో తెలిపారు.

నరేంద్ర మోడీ
ఆయన ఈ వారం ప్రారంభంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఫాక్స్కాన్ 2019 నుంచి తమిళనాడులోని ప్లాంట్‌లో 2019 నుంచి ఆపిల్ హ్యాండ్‌సెట్‌లను తయారు చేస్తోంది. యాపిల్, ఫాక్క్సాన్ చైనాలో కాకుండా ప్రత్యమ్నాయలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చైనీలోని జెంగ్‌జౌలో కంపెనీలోని విశాలమైన ఐఫోన్ అసెంబ్లీ కాంప్లెక్స్ ప్రస్తుతం 200,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కోవిడ్ తో ఈ కాంప్లెక్స్ చాలా రోజులు మూతపడింది. దీంతో కంపెనీ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో చైనాలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్ కాన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications