ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు చాలా కంపెనీల్లో పని చేస్తుంటారు. అయితే అన్ని కంపెనీల్లో వర్క్ కల్చర్ ఒకేలా ఉండదు. అయితే ప్రపంచంలో మంచి వర్క్ కల్చర్ కలిగిన కంపెనీలు ఏవి అనే అంశంపై ప్రతిఏటా ఫార్చ్యూన్ మీడియా ఒక లిస్ట్ రిలీజ్ చేస్తుంది. అందులో భాగంగా 2025 లిస్ట్ వచ్చేసింది. మరి ఇందులో ఏమేం కంపెనీలు ఉన్నాయో చూద్దామా?
ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ వర్క్ ప్లేస్ కలిగిన కంపెనీల లిస్ట్ కోసం ఫార్చ్యూన్ మీడియా
25 మిలియన్లకు పైగా ఉద్యోగులతో ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో పాల్గొన్న ఉద్యోగులు తమ ఆఫీస్‌లో వర్క్ కల్చర్ ఆధారంగా రేటింగ్ ఇస్తారు. ఈ రేటింగ్ ఆధారంగా బెస్ట్ వర్క్ ప్లేస్ అవార్డులు నిర్ణయిస్తారు.

ముందుగా ఈ సర్వేలో పాల్గొనే సంస్థలకు కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం 5,000 మందికి ఉపాధి కల్పించాలి. మల్టీ నేషనల్ కంపెనీలై ఉండాలి. అన్ని ప్రాంతాల్లో స్థిరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఇలాంటి కంపెనీలన పరిగణలోకి తీసుకుని వాటిలో బెస్ట్ వర్క్ కల్చర్ ను సర్వే ద్వారా నిర్ణయిస్తారు. అయితే ఈ లిస్ట్ లో హిల్టన్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో DHL ఎక్స్‌ప్రెస్, సిస్కో వంటి కంపెనీలు ఉన్నాయి. అలాగే ఇందులో యాక్సెంచర్, మారియట్ ఇంటర్నేషనల్, టీపీ, ఎన్విడియా, సేల్స్ ఫోర్స్, అడోబీ, డవ్, అలియాంజ్, స్ట్రైకర్, సేల్స్‌ఫోర్స్ వంటి పలు మల్టీ నేషనల్ కంపెనీలు లిస్ట్ అయ్యాయి
టాప్ 25 లిస్ట్ ఇదే
టాప్ 25 లిస్ట్ లో టూరిజం, ఐటీ, హెల్త్, ఫైనాన్స్, మ్యానుఫాక్చరింగ్ రంగాలకు చెందిన పలు కంపెనీలు లిస్ట్ అయ్యాయి.లిస్ట్ ను వరుస ర్యాంకింగ్స్ ప్రకాఱం చూస్తే.. హిల్టన్, DHL ఎక్స్‌ప్రెస్, సిస్కో, యాక్సెంచర్, అబ్‌వీ, మారియెట్ ఇంటర్నేషనల్, టీపీ, సేల్స్ ఫోర్స్, స్ట్రైకర్, మెట్‌లెఫ్, స్పెక్ సేవర్స్, సీమెన్స్ హెల్త్ నీర్స్, సర్వీస్ నౌ, ఎక్స్ పీరియన్, ఎన్వీడియా, కేడన్స్ ,డవ్, అలియాంజ్, వైయాట్రిస్, అడోబీ, క్రౌడ్ స్ట్రైక్, ఎస్‌సీ జాన్సన్, హిల్టి, ట్రెక్ బైస్కిల్, అడ్మిరల్ గ్రూప్ వంటివి మొదటి 25 స్థానాల్లో ఉన్నాయి. వీటిలో టీపీ, సీమెన్స్ హెల్త్ నీర్స్, స్పెక్ సేవర్స్, ఎక్స్ పీరియన్, అలియాంజ్, వయాట్రిస్, డవ్, క్రౌడ్ స్ట్రైక్, ట్రెక్ బైస్కిల్, అడ్మిరల్ గ్రూప్ వంటి కంపెనీలు మినహాయించి మిగిలిన కంపెనీలన్నీ ఇండియా నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నాయి.
సర్వే ఇలా..
గ్రేట్ వర్క్ ప్లేస్ టూ వర్క్ సర్వేలో మొత్తం 90 లక్షల మంది ఉద్యోగులు పార్టిసిపేట్ చేశారు. అన్ని సంస్థల్లో కలిపి సుమారు 2 కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక సర్వేలో భాగంగా కంపెనీపై ఉద్యోగులకు ఉన్న నమ్మకం, పనిలో అనుకూల వాతావరణం, ఉద్యోగులకు వసతులు, విభిన్న ప్రంతాల్లో బ్రాంచీల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటికి సంబంధించిన ప్రశ్నలు, ఆప్షన్స్ ద్వారా ఉద్యోగులు వాళ్ల కంపెనీలకు రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్ ఆధారంగా బెస్ట్ కంపెనీలను నిర్ణయిస్తారు. అయితే ఈ లిస్ట్ లో ఉన్న టాప్ 25 కంపెనీలలో 16 కంపెనీలు ఇండియాలో కూడా పనిచేస్తున్నాయి. అంటే ఇండియాలో వర్క్ కల్చర్ రోజురోజుకీ ఇంప్రూవ్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications