సిస్కో సిస్టమ్స్ మాజీ CEO జాన్ చాంబర్స్ కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం గురించి తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే AI ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ తాజా ప్రకటన ఉద్యోగులను మరింత ఆందోళనలోకి నెట్టేసింది. ఇటీవల ఫార్చ్యూన్‌తో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఫార్చ్యూన్ 500 కంపెనీలలో 50 శాతం అదృశ్యం అవుతాయని, అలాగే వాటి 50 శాతం ఎగ్జిక్యూటివ్‌లు కూడా అదృశ్యం అవుతారని తెలిపారు.
1990ల ఇంటర్నెట్ బూమ్, తదుపరి క్రాష్ సమయంలో సిస్కోను నడిపించిన అనుభవం ఆధారంగా..AI తరంగాన్ని డాట్-కామ్ యుగంతో చాంబర్స్ పోల్చారు. అయితే, AI స్వీకరణ వేగం, పరిణామాలు అంతకుమించి నాటకీయంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. AI ఐదు రెట్లు వేగంగా కదులుతోంది, ఇంటర్నెట్ యుగ ఫలితాలను మూడు రెట్లు ఉత్పత్తి చేస్తోందని చాంబర్స్ చెప్పారు. స్టార్టప్‌లు సంవత్సరాల లోపల కాకుండా వారాల్లో ఉత్పత్తులను అభివృద్ధి చేయగలవన్నారు. ఇది మార్కెట్ పరిణామాలను వేగంగా మార్చుతుందని తెలిపారు.

ఈ వేగవంతమైన పరివర్తనంలో విజేతలతో పాటుగా ఓడిపోయిన వారు ఉంటారని ఆయన హెచ్చరించారు. సాంకేతికతను స్థిరమైన పోటీ ప్రయోజనంగా మార్చుకోలేని కంపెనీలు పరాజయాన్ని ఎదుర్కోవడం సహజమని చాంబర్స్ చెప్పారు. యజమానులు కొత్త ఆవిష్కరణలకు తక్షణంగా సరిపోయే సామర్థ్యం కలిగి లేనప్పుడు కొన్ని కంపెనీలు వృద్ధి చెందుతాయి, మరికొన్ని అదృశ్యమవుతాయిని తెలిపారు.
ఉద్యోగాల విషయానికి వస్తే.. చాంబర్స్ తీవ్ర హెచ్చరించిక ఏంటంటే.. AI ఇంటర్నెట్ కంటే ఐదు రెట్లు వేగంగా కదులుతోందని చెప్పడం. కాబట్టి ఉద్యోగాలు త్వరగా నాశనం అవుతాయి. కొత్త పాత్రలు తుది దశలో సృష్టించబడుతాయని ఆయన అంగీకరించినప్పటికీ ఈ సర్దుబాటు సమయంలో చాలా మందికి తిరిగి విద్యను అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా వైట్-కలర్, బ్లూ-కలర్ ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కంపెనీలు విద్యా, శిక్షణ వ్యవస్థలను పునరాలోచన చేయాలని కోరారు.
కానీ వ్యాపారాలను పూర్తి రూపంలో పరిశీలిస్తే..AI సామర్థ్యాన్ని లాభాలు పెంచడానికి, ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని కూడా చాంబర్స్ గుర్తించారు.అయితే తనను త్వరగా ఆవిష్కరించుకునే కంపెనీలు మాత్రమే మనుగడ కొనసాగిస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. "మార్కెట్ కదలే వేగం, CEOలు తమను తాము తిరిగి ఆవిష్కరించలేకపోతే వెనుకబడతారని ఆయన హెచ్చరించారు.చాంబర్స్ ప్రకారం ప్రస్తుత వ్యాపార వాతావరణం అత్యంత అనిశ్చితమైనది. AI స్వీకరణలో విఫలమైన నాయకులు, సంస్థలు ఫెయిల్ అవక తప్పదని చెబుతున్నారు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications