మీరు ప్రతి ఏటా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేయడానికి మీ కంపెనీ ఇచ్చే ఫామ్-16 కోసం ఎదురుచూస్తున్నారా? అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి పరిస్థితులు మారబోతున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుండి Form 16 స్థానంలో 'ఫామ్ 130' (Form 130) అమల్లోకి రానుంది. ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ప్రకారం, ప్రభుత్వం పన్ను చెల్లింపుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సాంకేతికతతో ముడిపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అసలు ఈ మార్పు వల్ల ఉద్యోగులకు కలిగే లాభనష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.
కొత్త ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ ప్రకారం, ఇప్పటివరకు వాడుకలో ఉన్న Form 16 ఇకపై అందుబాటులో ఉండదు. దాని స్థానంలో వచ్చే ఫామ్-130 మరింత వివరంగా ఉంటుంది. ఇది ప్రధానంగా మూడు భాగాలను కలిగి ఉంటుంది..
- మొదటి భాగం: యజమాని (Employer) , ఉద్యోగి యొక్క పూర్తి వివరాలను తెలియజేస్తుంది.
- రెండవ భాగం: మీ జీతం , దాని నుండి కట్ అయిన టీడీఎస్ (TDS) సారాంశాన్ని చూపుతుంది.
- మూడవ భాగం: ఇది చాలా కీలకం. మీ పన్ను విధించదగిన ఆదాయం (Taxable Income) ఎలా లెక్కించబడిందో పూర్తి విశ్లేషణను ఇది వివరిస్తుంది.
పారదర్శకతకు పెద్దపీట
కొత్త ఫామ్-130 డిజైన్ ప్రకారం, మీ జీతం విడదీసి చూపడమే కాకుండా.. మీకు లభించే మినహాయింపులు (Exemptions), డిడక్షన్స్, మీరు పొందిన రిలీఫ్ వివరాలన్నీ స్పష్టంగా ఉంటాయి. దీనివల్ల కంపెనీ రిపోర్ట్ చేసే వివరాలకు, మీరు ఫైల్ చేసే రిటర్న్స్‌కు మధ్య వ్యత్యాసాలు (Mismatches) తగ్గుతాయి.
ఎవరిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
- జీతభత్యాల ఉద్యోగులు: వీరికి ఐటీఆర్ ఫైలింగ్ మరింత సులభం కానుంది. ఎందుకంటే చాలా వివరాలు ముందే ఫిల్ అయి (Pre-filled) వస్తాయి.
- పెన్షనర్లు: సీనియర్ సిటిజన్లకు పెన్షన్ , వడ్డీ ఆదాయాన్ని రిపోర్ట్ చేయడం ఈ కొత్త విధానంతో సులభతరం అవుతుంది.
- పెట్టుబడిదారులు: క్యాపిటల్ గెయిన్స్ వివరాలను రిపోర్ట్ చేసేటప్పుడు మరింత ఖచ్చితత్వంతో ఉండాల్సి ఉంటుంది.
మాన్యువల్ సర్టిఫికెట్లకు చెక్
ఇకపై యజమానులు తమకు నచ్చినట్టుగా మాన్యువల్ గా టాక్స్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి వీలుండదు. ఫామ్-130 కేవలం 'ట్రేసెస్' (TRACES) పోర్టల్ ద్వారా మాత్రమే జనరేట్ అవుతుంది. అంటే, కంపెనీలు తమ క్వార్టర్లీ టీడీఎస్ స్టేట్‌మెంట్లను సకాలంలో ఫైల్ చేస్తేనే, ఈ ఫామ్ సిస్టమ్ ద్వారా వస్తుంది. దీనివల్ల తప్పులు దొర్లే అవకాశం చాలా తక్కువ.

Form 16 నుండి ఫామ్-130 కి మారడం అనేది డిజిటల్ ఇండియా దిశగా మరో అడుగు. ఇది పన్ను చెల్లింపుదారులకు పని సులభం చేసినప్పటికీ, మనం సమర్పించే వివరాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సిస్టమ్ ఆధారిత డేటా కాబట్టి, చిన్న పొరపాటు జరిగినా నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త రూల్స్ పట్ల అవగాహన పెంచుకోవడం ఉత్తమం.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications