భారత మార్కెట్ నుండి వైదొలుగుతున్నట్లు గత ఏడాది ప్రకటించిన కార్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజం ఫోర్డ్ యూటర్న్ తీసుకున్నది. మన దేశంలో కార్ల ఉత్పత్తిపై పునరాలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ప్రణాళిక రూపొందిస్తోంది. విద్యుత్ కార్ల తయారీపై లబ్ధి పొందేందుకు పీఎల్ఐ స్కీమ్ కోసం ఫోర్డ్ మోటార్స్ దరఖాస్తు చేసుకుంది. ఫోర్డ్‌తో పాటు మారుతీ సుజుకీ సహా 20 కార్ల తయారీ సంస్థలు పీఎల్ఐ స్కీమ్ కోసం దరఖాస్తులు చేసుకున్నాయి.
దేశీయంగా విద్యుత్ వాహనాలను తయారీ చేసి, విక్రయించిన సంస్థలకు కేంద్రం పీఎల్ఐ కింద రూ.25,938 కోట్ల మేరకు లబ్ధి చేకూరుస్తుంది. గుజరాత్‌లోని సనద్ ప్లాంట్ కలిగి ఉన్న ఫోర్డ్ అక్కడి నుండి వంద శాతం ఎలక్ట్రిక్ కార్ల తయారీతో పాటు విదేశాలకు ఎగుమతి చేయాలని సంకల్పించింది.

పీఎల్ఐ కింద ఫోర్డ్ సమర్పించిన దరఖాస్తుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. తమ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందుకు ఫోర్డ్ ఇండియా కేంద్రానికి సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ తెలిపింది. కేంద్రం ఆమోదం పొందిన సంస్థలు వచ్చే రెండేళ్లలో స్ట్రాటెజీ, ప్రోడక్ట్స్ మీద దృష్టి సారిస్తాయి. 2024 నుండి అయిదేళ్ల పాటు పీఎల్ఐ స్కీమ్ అమలవుతుందని తెలిపింది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications